2024 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా.. మంగళవారం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఈ టోర్నీలో కెనడాను ఓడించి పాకిస్తాన్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. కెనడాపై పాకిస్తాన్ గెలిచినప్పటికీ.. ఆ జట్టుకు సమస్యలు తీరలేదు. కాగా.. పాకిస్తాన్ జట్టు తదుపరి మ్యాచ్ జూన్ 16న ఐర్లాండ్‌తో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఫ్లోరిడాలో వాతావరణం పాక్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ జట్టు ఆడిన 3 మ్యాచ్ల్లో రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. కెనడాతో…
మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో కలరా వ్యాప్తి కలకలం రేపుతుంది. ఈ వ్యాధితో ఇద్దరు వృద్ధులు మరణించారు. 80 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని ఆరోగ్య అధికారి బుధవారం తెలిపారు. జిల్లాలోని ఫూప్ టౌన్‌లోని వార్డు నంబర్ 5, 6, 7లో నీరు కలుషితం కావడంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం చేసే వీడియో ఒకటి బయటపడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఓ వార్డులో ఎలుకలు తిరుగుతున్నట్లు కనపడే వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ ఘటనతో వైద్య సదుపాయంలో సమర్థవంతమైన పెస్ట్ కంట్రోల్‌ను ఆదేశించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను.. మధ్యప్రదేశ్‌లోని ప్రతిపక్ష కాంగ్రెస్ మంగళవారం తన X హ్యాండిల్‌లో షేర్ చేసింది. గ్వాలియర్‌లోని కమల రాజా ఆసుపత్రిలో "రోగుల కంటే ఎలుకలు ఎక్కువ" అని పేర్కొంటూ,…
వేసవి కాలంలో ఎక్కువగా లభించే పండ్లలో మామిడి పండు ఒకటి. పండ్లకు రారాజు మామిడి పండు. మామిడి పండు తినడం అంటే అందరికీ ఇష్టమే. అయితే.. మార్కెట్‌లో రకరకాల మామిడి పండ్లు దొరుకుతాయి. ఇవి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ పండులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం మరియు విటమిన్లు ఎ, సి, బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల కలిగే కొన్ని అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను 13 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన కుర్రాడు కలవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా.. యాపిల్ (Apple) అతిపెద్ద ఈవెంట్ వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 జరుగుతోంది. ఈవెంట్ మొదటి రోజున ఆపిల్ తన వినియోగదారుల కోసం అనేక పెద్ద ప్రకటనలు చేసింది. ఈ క్రమంలో ఆపిల్ యొక్క ఈ వార్షిక ఈవెంట్‌లో చాలా మంది వ్యక్తులు భాగమయ్యారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన విభిన్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో టిమ్ కుక్‌తో కలిసి…
బీసీసీఐ భారత జట్టు వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆటగాళ్లు వేర్వేరు జట్లుగా విడిపోయారు. ఆటగాళ్లను మూడు వేర్వేరు జట్లుగా విభజించి అందరూ సరదాగా ఫీల్డింగ్ సెషన్‌లో పాల్గొన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ సమయంలో ఆటగాళ్లు స్టంప్‌పై గురి పెట్టాల్సి వచ్చింది. ఎక్కువ లక్ష్యాలను చేధించే జట్టు విజేతగా నిలుస్తుంది. రోహిత్ శర్మ జట్టులో మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లతో కూడిన జట్టు…
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాము కాటేయడంతో రాణి (16)అనే బాలిక మృతి చెందింది. వేసవి కాలం సెలవుల కోసమని తన బంధువులైనా పెద్దమ్మ ఇంటికి కత్తిగూడెం వెళ్లింది. అయితే సరదాగా గడుపుదామనుకున్న బాలిక శవమై వచ్చింది. పెద్దమ్మ ఇంటి వద్ద గడ్డివాము దగ్గర ఆరుబయట మంచం మీద కూర్చుంది. తనకు తెలియకుండానే విష పురుగు రాణిని కాటేసింది. మొదట ఎలుకగా భావించిన కుటుంబ సభ్యులు.. బాలిక పరిస్థితి విషమించింది. దీంతో.. బాలికను వెంటనే ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స…
డబ్బులు సంపాదించడానికి ఏ పని చేయడానికైనా వెనుకాడటం లేదు. దొంగతనాలు, దోపిడీలు ఇలా ఏది పడితే అది డబ్బుల కోసం చేసేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన.. ఓ కుటుంబం మొత్తం డబ్బులు సంపాదించుకోవడం కోసమని ఘరానా మోసాలకు పాల్పడుతుంది. ఈ క్రమంలో ఆ కుటుంబాన్ని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ మోసాలతో పాటు నకిలీ వైద్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న శివకుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధి వరకు జీహెచ్ ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను విస్తరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. హైదరాబాద్ నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ఆకస్మిక వర్షాలు, వరదలు వచ్చినా.. ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా తగు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు.
పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వాహనం కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదం.. ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని షాంగ్లా జిల్లాలోని బర్బత్‌కోట్ ప్రాంతంలో సోమవారం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే ఐదుగురు మరణించినట్లు స్థానిక మీడియా సంస్థ సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్యూ సిబ్బంది.. మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీసి వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు.