Sikkim: సిక్కింలో విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు
- సిక్కింలోని మంగన్ జిల్లాలో భారీ వర్షాలు
- విరిగిపడ్డ కొండచరియలు
- ఒకరు మృతి.. ఐదుగురు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిక్కింలోని మంగన్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారని అధికారులు గురువారం తెలిపారు. మరోవైపు.. కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయి.. ఇళ్లు దెబ్బతిన్నాయి, విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే.. భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగన్ జిల్లాలోని పక్షేప్ ప్రాంతంలో ఒక మృతదేహాన్ని గుర్తించారు. రంగ్‌రాంగ్ సమీపంలో ముగ్గురు, పక్షేప్ నుండి ఇద్దరు మిస్సింగ్ అయినట్లు అధికారులు తెలిపారు.
Read Also: ATM Withdrawal Charges: అలర్ట్.. భారీగా పెరగనున్న క్యాష్ విత్డ్రా ఛార్జీలు..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
మరోవైపు.. భారీ వరదలతో తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో సిక్కింలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలోని మెల్లి స్టేడియంను వరదలు ముంచెత్తుతున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. గీతాంగ్‌లో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. పెంటోక్ సమీపంలోని నాంపతంగ్ వద్ద రోడ్లు దెబ్బతిన్నాయి. ఉత్తర సిక్కింలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మొబైల్ నెట్‌వర్క్ సేవలకు అంతరాయం కలిగింది. మరోవైపు.. మంగన్ జిల్లాకు రేషన్ సరఫరాలతో కూడిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాన్ని జిల్లా యంత్రాంగం అభ్యర్థించింది.
Read Also: PK Mishra: ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా..మోడీతో ఆయనకున్న సంబంధమేంటి?
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్.. విపత్తుపై ఉత్తర జిల్లా యంత్రాంగం, పోలీసులు ఇతర అధికారులతో మాట్లాడారు. “బాధితులు, బాధిత కుటుంబాలకు రికవరీ సహాయం, తాత్కాలిక పరిష్కారం.. ప్రాథమిక అవసరాల సదుపాయంతో సహా సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని తమాంగ్ చెప్పారు. “బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది.. మృతుల కుటుంబాలకు, కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన, నిరాశ్రయులైన వారందరికీ ఆదుకుంటామని” తెలిపారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!