టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా అమెరికాను ఓడించి సూపర్-8కి చేరింది. అయితే.. అమెరికా ఓటమితో సూపర్-8కి చేరుకోవాలన్న పాకిస్థాన్ ఆశలు సజీవంగానే మిగిలాయి. మరోవైపు.. ఇతర జట్ల ప్రదర్శనపై కూడా ఆధారపడి ఉంది. అయితే.. పాకిస్తాన్ జట్టు తన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడేందుకు ఆటంకం కలిగేలా ఉంది. జూన్ 16న ఐర్లాండ్‌తో పాకిస్తాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ కు వర్ష గండం బీభత్సంగా ఉంది. పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్ జరిగే ఫ్లోరిడాలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో.. పాకిస్తాన్ జట్టులో ఆందోళన ప్రారంభమైంది.
వాస్తవానికి, దక్షిణ ఫ్లోరిడాలో మంగళవారం నుంచి ప్రారంభమైన భారీ వర్షం.. శుక్రవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఫ్లోరిడాలో వరదల కారణంగా ఫోర్ట్ లాడర్‌డేల్‌లో ‘ఎమర్జెన్సీ’ ప్రకటించారు. సౌత్ ఫ్లోరిడా విమానాశ్రయాలకు వెళ్లాల్సిన వందలాది విమానాలను స్థానిక అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న శ్రీలంక క్రికెట్ జట్టు నగరంలోనే చిక్కుకుపోయింది. టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి USAలోని మూడు వేదికలలో ఫోర్ట్ లాడర్‌డేల్ ఒకటి. ఈ స్టేడియం భారతదేశం, పాకిస్తాన్, అమెరికా పాల్గొనే మూడు ముఖ్యమైన గేమ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇంతకుముందు ఈ స్టేడియంలో జరగాల్సిన శ్రీలంక-నేపాల్ మ్యాచ్ రద్దు అయింది.
CM Chandrababu Naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి ఐదు సంతకాలు వీటిపైనే..
ఫోర్ట్ లాడర్‌డేల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ ఈ వారం కీలకమైన గేమ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. గ్రూప్ A నుండి తదుపరి రౌండ్‌లో స్థానం కోసం పాకిస్తాన్- అమెరికా తలపడనున్నాయి. శుక్రవారం ఐర్లాండ్‌తో అమెరికా ఆడగా, ఆదివారం అదే ప్రత్యర్థులతో పాకిస్థాన్ తలపడనుంది. అమెరికా ఐర్లాండ్‌ను ఓడించినట్లయితే లేదా మ్యాచ్ వాష్ అవుట్ చేసినట్లయితే.. వారు సూపర్ 8కి అర్హత సాధిస్తారు. ఇప్పటికే సూపర్-8కు చేరిన భారత్.. రెండవ స్థానం కోసం పాకిస్తాన్, అమెరికా చూస్తున్నాయి. అందుకు నికర రన్ రేట్ ముఖ్యం. నెట్ రన్ రేట్ ప్రకారం అమెరికా కంటే పాకిస్థాన్ ముందుంది. పాకిస్థాన్ 0.191, యునైటెడ్ స్టేట్స్ 0.127 ఉంది.
అయితే.. పాకిస్తాన్ తర్వాత మ్యాచ్ లలో ఐర్లాండ్, అమెరికాను ఓడించాలి.. అలా అయితేనే పాకిస్తాన్ జట్టు సూపర్-8 కు చేరుతుంది. మరోవైపు అమెరికా కూడా ఒక పాయింట్ వస్తే అర్హత సాధించే అవకాశం ఉంది. ఐర్లాండ్ వర్సెస్ అమెరికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా.. అమెరికా జట్టు సూపర్-8కి చేరుకుంటుంది. అదే సమయంలో.. పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్ రద్దు చేయబడితే, పాకిస్తాన్ జట్టు కేవలం ఒక పాయింట్ మాత్రమే వస్తుంది. దీంతో పాకిస్తాన్ జట్టు సూపర్ -8కు చేరుకోలేదు. అమెరికా సూపర్-8కు వెళ్తుంది.