ఢిల్లీ పోలీస్ ఆఫీసరుగా నటించి కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారి కుమారుడి దగ్గరి నుంచి రూ.3 కోట్లు దోపిడీ చేశాడు. ఈ కేసులో హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సచిన్ కుమార్, దీపక్ కుమార్ గా గుర్తించారు. కాగా.. తనకు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని బాధితుడు కోల్‌కతా పోలీసుల సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేశాడు. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ఢిల్లీ పోలీసు అధికారి అని చెప్పాడని తెలిపాడు. తనకు అనుమానాస్పదంగా పంపిన…
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్‌లో బిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. రోజూ కోట్ల మంది దీనిని వాడుతుంటారు. ఎన్నో ఫొటోలు, ఎన్నో వీడియోలు. సామాన్యుడిగా మొదలై ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లో సెలెబ్రిటీలు అయినవారు ఉన్నారు. ఎప్పటికప్పుడు పోస్ట్లు పెడుతూ.. చురుకుగా ఉంటారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో సామాన్యులు, వ్యాపారవేత్తలకు మంచి ఫాలోయింగ్ ఉంది.
నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ అంటే దాదాపు అందరికి ఇష్టమైన వంటకం. చికెన్ రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చికెన్లో ఉండే ప్రోటీన్ మంచి మూలం తినడం వల్ల.. శరీరంలో ప్రోటీన్ లోపం సమస్య ఉండదు. ఇదిలా ఉంటే.. చికెన్లో ఎక్కువగా చికెన్ బిర్యానీ, బటర్ చికెన్ ను జనాలు తింటారు. అయితే ప్రతిసారీ ఇలాంటివి కాకుండా.. కొన్నిసార్లు కొత్తగా ట్రై చేయండి. చికెన్తో చికెన్ కీమా మటర్‌ను తయారు చేసుకోండి.
వర్షాకాలం జ్వరం, జలుబు సమస్యలను పెంచుతుంది. వర్షాకాలంలో హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతలు జ్వరం, జలుబు బారిన పడే అవకాశాలను పెంచుతాయి. దానితో పాటు ముక్కు కారటం, గొంతు నొప్పి, కళ్ళు నుండి నీరు కారడం, చలి వంటి లక్షణాలు ఉంటాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అందువల్ల.. మీరు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలనుకుంటే.. మీరు మీ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవాలి.
బీఎండబ్ల్యూ నుండి 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్ (LWB) లాంఛ్ కానుంది. ఈ కారు.. ఇండియాలో 2024 జూలై 24న రిలీజ్ అవుతుంది. కాగా.. అందుకు సంబంధించి బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ కారు.. ఇండియాలో మాత్రమే అసెంబ్లింగ్ చేయబడుతుంది. ఈ కొత్త కారు కోసం ప్రీ-బుకింగ్‌లు ఇప్పుడు భారతదేశంలోని BMW డీలర్‌షిప్‌లలో.. బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ స్టోర్లలో ప్రారంభమయ్యాయి.
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ఇటీవలే ధోనీ ఎడిషన్ సి3 ఎయిర్‌క్రాస్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.82 లక్షలు. C3 ఎయిర్‌క్రాస్ మిడ్-స్పెక్ ప్లస్ వేరియంట్‌పై కంపెనీ ఇప్పుడు రూ. 2.62 లక్షల ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. U, Plus, Max వేరియంట్‌లలో లభించే C3 Aircross.. పరిమిత యూనిట్లపై మాత్రమే తగ్గింపు అందుబాటులో ఉంటుంది.
ఇటలీలో ఓ భారతీయ వ్యవసాయ కూలీ మృతి విషాదంగా మారింది. అక్కడ భారతీయ కార్మికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సత్నామ్ సింగ్ (31) అనే వ్యక్తి బుధవారం రోమ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గ్రామీణ ప్రాంతమైన ఆగ్రో పాంటినోలోని పొలంలో పనిచేస్తుండగా గాయపడ్డాడు. రెండ్రోజుల పాటు ఆస్పత్రితో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృడుతు పంజాబ్ రాష్ట్రానికి చెందిన మోగా నివాసి.
మునగకాయ అనేక సమస్యలకు దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. వివిధ రకాల వంటలలో విరివిగా వాడుకునే మునక్కాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ చెట్టు వేరు నుంచి ఆకు వరకు ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే దీనిని 'జీవన వృక్షం' అని కూడా పిలుస్తారు. మునక్కాయలో విటమిన్లు, అమైనో ఆమ్లాలు, అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
పండుగ వచ్చిదంటే చాలు రకరకాల తినుబండరాలు, వంటకాలు చేస్తారు. అందుకోసం ఎక్కువగా నూనెను వాడుతారు. అయితే.. వంటలు చేసేందుకు పాన్‌లలో అధికంగా నూనెను పోస్తుంటారు. అన్నీ వంటకాలు చేయగా మిగిలిన నూనెను మళ్లీ వేరే వంటకాల కోసం దాచిపెడతారు. అలా వాడిన నూనెను మళ్లీ మళ్లీ వినియోగిస్తుంటారు. అయితే.. ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడటం చాలా ప్రమాదకరం.. దాని పర్యావసానల వల్ల ప్రాణాలకే ముప్పు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం వల్ల…
మధ్యప్రదేశ్‌లో అమానుష ఘటన వెలుగు చూసింది. ధార్ జిల్లాలో మహిళను ఓ వ్యక్తి కర్రతో అందరూ చూస్తుండగా కొడుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో.. నలుగురు వ్యక్తులు ఆ మహిళను పట్టుకుని ఉంటే మరొక వ్యక్తి కర్రతో వెనుక భాగాన కొడుతున్నాడు. అయితే.. ఆ మహిళ ఏం పనిచేసిందో తెలియదు కానీ.. నలుగురి చేతిలో నుంచి బయట పడేందుకు ఆమెకు ఎవరూ సాయం చేయలేదు. అంతేకాకుండా.. చూస్తూ ఫోన్లో ఈ ఘటనను రికార్డ్ చేశారు.