యూపీలోని బిజ్నోర్‌లో విషాదం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం కారణంగా బావ, మరదలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఈ క్రమంలో.. కొంతకాలం క్రితం వీరు ఇంట్లో నుంచి పారిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. రాఖీ అనే మహిళకు ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు.. వరుసకు బావ అయ్యే డేవిడ్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పడింది. వీరిద్దరు కలిసి నెల రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఎక్కడ తమ పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాగా.. ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది.. దీంతో కోపంతో ఉన్న కుటుంబ సభ్యులు, పారిపోయిన డేవిడ్, రాఖీలను తిట్టేవారు.
Siddaramaiah: ఏపీ, తమిళనాడులో కర్ణాటక పరిస్థితి కనిపించదు.. “కన్నడ” ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి..
ఈ క్రమంలో విసిగిపోయిన డేవిడ్, రాఖీలు చనిపోదామని నిర్ణయించుకున్నారు. జూన్ 19న నజీబాబాద్ లోని గర్మల్ పూర్ ఫ్లైఓవర్ సమీపంలో పాయిజన్ తీసుకున్నారు. కాగా.. వారు అపస్మారక స్థితిలో ఉండటం, ఇద్దరి నోటి నుంచి నురగ రావడం స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిద్దరినీ సమీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే.. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో బిజ్నోర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునే లోపే డేవిడ్, రాఖీలు చనిపోయారు.
EVM: తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లోని 8 లోక్‌సభ స్థానాలకు చెందిన ఈవీఎంల తనిఖీ.. ఎందుకో తెలుసా?
మృతదేహాలను పరిశీలించగా.. వారి వద్ద ఆధార్ కార్డులు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా ఇద్దరిని గుర్తించారు. దీంతో.. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే.. రాఖీ కుటుంబ సభ్యులు మాత్రం మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. తమ గౌరవాన్ని పాడు చేసిన అమ్మాయి.. తమకు సంబంధ లేదని అన్నారు. నెల రోజుల క్రితమే ఆమె చనిపోయిందని తెలిపారు. ఈ క్రమంలో.. వారిద్దరి మృతదేహాలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు పంపించారు. ఇదిలా ఉంటే.. డేవిడ్ బంధువు అనిల్ తో ఏడేళ్ల క్రితం రాఖీతో ప్రేమ వివాహం జరిగింది. మొదట్లో ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించగా.. వారిద్దరూ కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతం.. వారిని కాపాడిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కాగా.. వీరికి ఏడేళ్లు, ఐదు సంవత్సరాల కొడుకులు ఉన్నారు.