ఒకప్పుడు నగరాల్లో మాత్రమే ఉండే వంట గ్యాస్.. ఇప్పుడు గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికీ ఉన్నాయి. గ్యాస్ లేకుండా ఏమీ తినలేం.. అంతేకాకుండా.. సులభంగా, సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. అయితే.. గ్యాస్ వాడకం ఎక్కువగా ఉండటం వలన, సిలిండర్ ధరలు సామాన్యుడికి తలనొప్పిగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. గ్యాస్ వాడకాన్ని కొద్దిగా తగ్గించినప్పటికీ అనుకున్న సమయానికి ముందుగానే అయిపోతుంది. అయితే.. ఈ చిట్కాలు పాటించడం వలన గ్యాస్ తొందరగా అయిపోకుండా చూడొచ్చు. ఇంతకీ అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Invest in stock: స్టాక్ మార్కెట్లో మంచి షేర్ ని సెలెక్ట్ చేసుకోండిలా..లాభాలే లాభాలు..!
వంట చేసేటప్పుడు ఈ విషయాలపై శ్రద్ధ వహించండి
1. వంట చేసేటప్పుడు చాలా సార్లు మనం తడి పాత్రలను గ్యాస్ స్టవ్ పై ఉంచుతాము. దాని వలన తడి పాత్ర గ్యాస్ వేడికి ఆరిపోతుంది. ఈ ప్రక్రియలో చాలా గ్యాస్ వృధా అవుతుంది. అయితే.. తడిపాత్రలను ఒక గుడ్డతో తుడిచిన తర్వాతనే గ్యాస్ మీద పెట్టాలి.
2. వంట చేసేటప్పుడు వీలైనంత వరకు ప్రెజర్ కుక్కర్ ఉపయోగించండి. కుక్కర్ లో ఆహారం చాలా త్వరగా ఉడుకుతుంది. దీంతో గ్యాస్ ను ఆదా చేయవచ్చు. గ్యాస్ పై ఆహారం వండేటప్పుడు ఎప్పటికీ ఓ పాత్రను ఉంచాలి. అలా చేస్తే.. ఆహారం తొందరగా ఉడికిపోతుంది. దీంతో గ్యాస్ వినియోగం తగ్గుతుంది.
3. గ్యాస్ బర్నర్ ను ఎప్పటికప్పుడూ శుభ్రం చేస్తూ ఉండాలి. చాలాసార్లు.. ఎక్కువ రోజుల తర్వాత క్లీన్ చేయకపోవడం వల్ల అందులో దుమ్ము, ధూళి పేరుకుపోతుంది. దీంతో.. గ్యాస్ సరిగా మంట రాదు.. వృధా అయిపోతుంది. మంట రంగు చూడటం ద్వారా బర్నర్ ను శుభ్రపరచడం అవసరమా లేదా అని తెలుసుకోవచ్చు. మంట రంగు మారినట్లైతే.. శుభ్రం చేయవల్సిందని అర్ధం.
4. తరుచుగా మనం ఫ్రిజ్ నుండి నేరుగా పాలు వంటివి తీసుకొని గ్యాస్ మీద పెడుతాము. ఇలా చేయడం వల్ల ఎక్కువ గ్యాస్ అయిపోతుంది. ఎందుకంటే.. చల్లగా ఉన్న పాలు వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది. రిఫ్రిజిరేటర్ లో ఏమైనా వస్తువును గ్యాస్ మీద పెట్టేముందు కాసేపు బయట ఉంచాలి. అలా.. దాని చల్లదనం పోయి, త్వరగా వేడెక్కుతాయి.
5. ఎప్పుడూ తక్కువ మీడియం మంట మీద ఆహారాన్ని వండాలి. ఎక్కువ మంట మీద వంట చేయడం వల్ల గ్యాస్ ఎక్కువగా అయిపోతుంది. అలాగే పైప్ నుండి ఏదైనా లీకేజీ ఉందో లేదో తెలుసుకోవడానికి సిలిండర్ ను ఎప్పటికప్పుడూ తనిఖీ చేస్తూ ఉండాలి. మీరు ఈ చిన్న విషయాలను క్రమం తప్పకుండా పాటిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుంది.