IND vs AFG: సూపర్ -8పోరు.. మొదట బ్యాటింగ్ ఇండియాదే
- ఇండియా-అప్ఘనిస్తాన్ మధ్య సూపర్-8 మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- ఇరుజట్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక్కో మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. ఈరోజు ఇండియా-అప్ఘనిస్తాన్ మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఇరుజట్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక్కో మార్పు చేశారు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు టీమిండియా అవకాశం కల్పించింది. మరోవైపు.. కరీం జనత్ స్థానంలో హజ్రతుల్లా జజాయ్‌ను అఫ్ఘాన్ చేర్చింది. కాగా.. ఈ టోర్నీలో రోహిత్ సేన అద్భుతమైన ప్రదర్శన చూపిస్తూ.. సూపర్-8కి చేరుకుంది. అటు.. ఆఫ్ఘనిస్తాన్‌ను తేలికగా తీసుకోవడానికి లేదు. లీగ్ దశలో భారత్ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మరోవైపు.. రషీద్ ఖాన్ నేతృత్వంలోని అఫ్ఘనిస్తాన్ జట్టు హ్యాట్రిక్ విజయాలను అందుకోగా.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొంది. ఇండియా, అఫ్ఘనిస్తాన్ టీ20 హెడ్-టు-హెడ్ రికార్డ్ గురించి మాట్లాడితే.. ఇరు జట్లు మొత్తం 8 సార్లు ఢీకొన్నాయి. ఈ క్రమంలో.. భారత్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఏడుసార్లు ఓడించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
New Suv Car : త్వరలో భారతీయ మార్కెట్లోకి ప్రముఖ కంపెనీల కూపే ఎస్ యూవీ కార్స్..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.
అఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్:
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్, ఫజ్కీన్-ఉల్.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?