ఎండు కొబ్బరిని ఎక్కువగా దేవుడి పూజలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా.. చాలా మంది అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. ఎండు కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వివిధ పోషకాలతో కూడిన ఎండు కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు కొబ్బరిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి.
పండ్లలో రారాజు మామిడి.. అయితే మామిడి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే.. కానీ సాధారణంగా మామిడి పండు అంతా తిని.. చివర్లో పిక్క పారేస్తుంటాం..? కానీ ఆ పిక్క వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే.. ఇంకెప్పుడూ పారేయరు. మామిడిలో ఉండే అనేక పోషకాలు పిక్కలో కూడా ఉంటాయి.
పెరుగుతున్న పండ్లు, కూరగాయల ధరలు సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గత వారం రోజుల్లో చాలా కూరగాయల ధరలు రెండింతలు పెరిగాయి. వాటితో పాటు పండ్ల ధరలు కూడా దాదాపు రెట్టింపు అయ్యాయి. ఈ క్రమంలో.. పండ్లు, కూరగాయలకు ప్రజలు భారీ ధరలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవే కాకుండా.. పప్పుల ధరలు కూడా దాదాపు 11 శాతం పెరిగాయి.
ఉత్తర భారతదేశంలో తన నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఒబెన్ ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఒబెన్ రోర్‌ను ఢిల్లీలో అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ తన మొదటి డీలర్‌షిప్‌ను ఢిల్లీలోని పితంపురాలో ప్రారంభించింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో చేర్చబడిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది.
ఓలా ఎలక్ట్రిక్ దాని S1 స్కూటర్ పై రూ. 15,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ జూన్ 20 - 26 మధ్య వర్తిస్తుంది. ఈ ప్రయోజనాలు మొత్తం S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు వర్తిస్తాయి. బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ.. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో పురోగతిని సాధించింది. కంపెనీ ఇచ్చిన ఈ ఆఫర్ అమ్మకాలను పెంచుతుంది.
Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఈ కంపెనీ Y-సిరీస్‌లో భాగమైంది. Vivo Y58 5G ఫోన్.. ప్రీమియం వాచ్ వంటి కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్, సూపర్ క్వాలిటీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ అందించారు. బ్యాటరీ సామర్ధ్యం 6000mAh ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఇతర స్పెసిఫికేషన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ కస్టమర్లలో భద్రతకు ప్రసిద్ధి చెందిన స్కోడా.. గత నెల మే 2024లో కార్ల విక్రయాల డేటాను విడుదల చేసింది. గత నెలలో స్కోడా స్లావియా అమ్మకాలలో అగ్రస్థానాన్ని సాధించింది. మొత్తం 1,538 యూనిట్ల కార్లను విక్రయించింది. గతేడాది 2023 మేలో స్కోడా స్లావియా మొత్తం 1,695 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి.
బైక్, స్కూటర్ తయారీదారు టీవీఎస్ (TVS) భారతదేశంలో రేసింగ్ కోసం తన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌ను పరిచయం చేసింది. ఈ బైక్ పేరు అపాచీ RTE. కొంతమంది భాగస్వాముల సహకారంతో కంపెనీ ఈ బైక్‌ను తయారు చేసింది. ఇది ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. ఈ బైక్ గంటకు 200 కిమీ కంటే ఎక్కువ వేగంతో వెళ్తుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ మే అమ్మకాల బ్రేకప్ డేటాను కంపెనీ విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం 7 మోడళ్లను విక్రయిస్తుంది. ఈ క్రమంలో.. 4 వార్షిక క్షీణత ఎదుర్కోగా, 3 వార్షిక వృద్ధిని సాధించాయి. రాయల్ ఎన్ఫీల్డ్ భారీ డిమాండ్ ఉన్నప్పటికీ గత నెలలో అమ్మకాలు తగ్గాయి. అయితే.. ప్రతిసారీ మాదిరిగానే క్లాసిక్ 350 అత్యధికంగా అమ్ముడైన మోడల్ గా నిలిచింది.
మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో పోలీస్‌స్టేషన్‌పై గుంపు రాళ్లు రువ్విన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటనలో 8 మంది పోలీసులు గాయపడగా, వారిలో ఆరుగురిని ఆస్పత్రిలో చేరిపించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు.