తలలో పేను.. ఇది చూడ్డానికి చాలా చిన్న సమస్యే అయినా.. తెగ ఇబ్బంది పెడుతుంది. తలలో దురదతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు ఈ దురద జుట్టులో పేరుకుపోయిన మురికి ఏర్పడుతుంది. ఈ క్రమంలో.. పేను తయారవుతాయి. ఇవి జుట్టులో తన పనిని తాను చేసుకుంటూ వెళ్తాయి. ఈ పేలులు రక్తాన్ని పీల్చడమే కాకుండా.. ఇతర సమస్యలకు దారితీస్తాయి. తలపై పేలు ఉండి గోకితే ఇన్ఫెక్షన్‌తో పాటు స్కాల్ఫ్ హెయిర్ రూట్స్ బలహీనపడతాయి. ఇది జుట్టు రాలే సమస్యని పెంచుతుంది. కొందరికీ ఎక్కువగా గోకడం వల్ల తలలో రక్తస్రావం జరుగుతుంది. పేనుకు ప్రధాన కారణం ఇన్ఫెక్షన్. పేను సోకిన వ్యక్తి టోపీ, టవల్ లేదా దువ్వెనను ఎవరైనా ఉపయోగిస్తే.. ఆ పేనులు వారికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా.. పేలు ఉన్న వ్యక్తి పక్కన కూర్చున్న, పడుకున్న ఆ పేనులు వారికి వ్యాపిస్తాయి. అయితే.. పేనులను తొలగించేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తల పేనును తొలగించడానికి ఇంటి నివారణలు :
ఉల్లిపాయ రసం
జుట్టు నుండి పేనులను తొలగించడంలో ఉల్లిపాయ రసం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయ రసంలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇది పేనులను చంపడంలో సహాయకరంగా ఉంటుంది.
నిమ్మరసం
వెంట్రుకల నుండి పేనులను తొలగించడానికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది. పేనును చంపే గుణాలు నిమ్మరసంలో ఉంటాయి. ముఖ్యంగా ఇది పెద్ద పేనులకు చంపడంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది.
వెల్లుల్లి
వెల్లుల్లిలో ఇథనాల్ 8% ఉంటుంది. ఇది తల పేనులను 30 గంటల్లో చంపడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.
నిమ్మకాయ పేస్ట్
నిమ్మకాయలో పేనులను చంపే లక్షణాలు ఉన్నాయి. నిమ్మకాయు పేస్ట్ లా తయరు చేసుకుని జుట్టుకు పూయడం ద్వారా.. తల పేనులు తొలగిపోతాయి.
కర్పూరం
కర్పూరాన్ని చూర్ణం చేసి 50 నుండి 100 మి.లీ కొబ్బరి నూనెలో కలిపి రాత్రంతా అలానే ఉంచి మరుసటి రోజు తలస్నానం చేయాలి. పేనుల సమస్య ఉండదు.