బీఎండబ్ల్యూ (BMW)మోటోరాడ్.. తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియా మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. BMW CE 04గా పిలిచే ఈ స్కూటర్ జూలై 24న ప్రారంభం కానుంది. ప్రీమియం తయారీదారు నుంచి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో భారత మార్కెట్లో ఈ బీఎండబ్ల్యూ సీఈ 04కు ప్రత్యక్ష పోటీదారులు ఎవరూ లేరు. ఈ స్కూటర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
Heavy rainfall: ఈ రాష్ట్రాలకు అత్యధిక వర్ష సూచన
ఇంజిన్ పనితీరు
ఈ స్కూటర్‌లో లిక్విడ్-కూల్డ్ పర్మనెంట్-మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ను అమర్చింది. ఈ స్కూటర్ 41bhp శక్తిని, 61Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 130 కి.మీల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ ప్యాక@ను 0-100 శాతం ఛార్జింగ్ చేయడానికి సుమారు 4 గంటల 20 నిమిషాలు పడుతుంది. 0-80 శాతం ఛార్జింగ్ కు 3 గంటల 30 నిమిషాలు పడుతుంది. మీరు ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే, 0-100 శాతం ఛార్జ్ చేయడానికి 1 గంట 40 నిమిషాలు, 0-80 శాతం ఛార్జ్ చేయడానికి 1 గంట 5 నిమిషాలు పడుతుంది. ఈ స్కూటర్ కేవలం 2.6 సెకన్లలో 0 నుండి 50kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 120 కి.మీ.
ఫీచర్లు
ఈ స్కూటర్ ఏదో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా ఉంది. దాని చుట్టూ పెద్ద అప్రాన్లు, ఫ్లాట్ బాడీ ప్యానెల్లు అమర్చబడ్డాయి. దీని సీటు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. దీనికి స్టీల్ డబుల్ లూప్ ఫ్రేమ్ ఉంది. ఇందులో మీరు డిస్క్ బ్రేక్‌లు, ABSలను స్టాండర్డ్‌గా పొందుతారు. దీనితో పాటు.. ఇది కనెక్టివిటీ, నావిగేషన్‌తో కూడిన 10.25 అంగుళాల TFT డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ కూడా అందించబడింది. డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్‌తో పాటు.. ఎకో, రెయిన్ మరియు రోడ్ మోడ్ లను కలిగి ఉంది .
ధర
ఈ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షలుగా ఉండనున్నట్లు సమాచారం. అయితే.. ఈ స్కూటర్ లాంచ్ అయిన వెంటనే డెలివరీకి అందుబాటులో ఉంటుంది.