సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన పార్లమెంట్ సమావేశాల తొలిరోజు ఎమర్జెన్సీ వర్సెస్ అప్రకటిత ఎమర్జెన్సీపై చర్చ జరిగింది. లోక్ సభ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. 1975లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ప్రస్తావించారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధిస్తున్నామని ప్రకటించిన అనంతరం ప్రభుత్వం దానిని అమలు చేసిందని ప్రధాని మోడీ అన్నారు.ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ గురించి మాట్లాడి ఇంకెంత కాలం పాలించాలనుకుంటున్నారని ప్రధాని మోడీకి కౌంటర్ ఇచ్చారు. ఈ విషయాన్ని 100 సార్లు చెబుతాడు.. ఎమర్జెన్సీ ప్రకటించకుండా దానిని కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
ఖర్గే మాట్లాడుతూ.. పార్లమెంటు సమావేశాల తొలి రోజు నీట్, ఇతర పరీక్షల్లో పేపర్ లీక్ వంటి ముఖ్యమైన అంశాలపై ప్రధాని మాట్లాడతారని దేశం ఎదురుచూస్తోందని.. అయితే వాటిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో.. ఖర్గే ‘X’లో పోస్ట్ చేస్తూ, ‘ప్రధాని మోడీ ఈరోజు తన ప్రసంగంలో అవసరానికి మించి మాట్లాడారు. ‘ముఖ్యమైన విషయాలపై మోడీ ఏమైనా మాట్లాడతారని దేశం ఆశించింది. నీట్ మరియు ఇతర రిక్రూట్‌మెంట్ పరీక్షలలో పేపర్ లీక్ గురించి యువత పట్ల కొంత సానుభూతి చూపుతారు అనుకున్నాం. కానీ తమ ప్రభుత్వ రిగ్గింగ్, అవినీతికి సంబంధించి వారు ఎటువంటి బాధ్యత తీసుకోలేదు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంపై కూడా మోడీ మౌనం వహించారు’. అని ట్విట్టర్ లో తెలిపారు.
Read Also: AP Cabinet Decisions: నెలాఖరు నుంచి శ్వేత పత్రాల విడుదల.. వాటిపైనే దృష్టి..
మరోవైపు.. ‘గత 13 నెలలుగా మణిపూర్ హింసాకాండలో కూరుకుపోయిందని ఖర్గే పేర్కొన్నారు. అయితే మోడీ అక్కడికి వెళ్లలేదు.. ఈరోజు తన స్పీచ్ లో ఆ ప్రస్తావన రాలేదన్నారు. ఇదిలా ఉంటే.. అస్సాం, ఈశాన్య రాష్ట్రాలలో వరదలు, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, ఎగ్జిట్ పోల్, స్టాక్ మార్కెట్ స్కామ్, తదుపరి జనాభా గణనను మోడీ ప్రభుత్వం చాలా కాలంగా పెండింగ్‌లో ఉంచింది’. వీటిపై కూడా మౌనంగా ఉన్నారని ఖర్గే ‘X’లో పేర్కొన్నారు.