TATA Motors: జూలై 1 నుండి పెరగనున్న టాటా మోటార్స్ ధరలు.. కారణమేంటంటే..?
- జూలై 1 నుండి పెరగనున్న టాటా మోటార్స్ ధరలు
- వాణిజ్య వాహనాల ధరలను 2 శాతం పెంచనున్నట్లు ప్రకటన
- ముడి సరుకుల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాటా గ్రూప్ కంపెనీ టాటా మోటార్స్.. తన కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వనుంది. తన వాణిజ్య వాహనాల ధరలను జూలై 1 నుంచి 2 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి సరుకుల ధరలు పెరగడంతోనే ఈ మేరకు అన్ని మోడళ్లు, వేరియంట్ల ధరలను పెంచాల్సి వస్తోందని కంపెనీ తెలిపింది. ఇది మొత్తం వాణిజ్య వాహనాల శ్రేణికి వర్తిస్తుందని.. మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతాయని కంపెనీ పేర్కొంది.
Read Also: DCP Vineet : మియాపూర్ భూ వివాదం.. 21 మంది అరెస్ట్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
టాటా మోటార్స్ భారతదేశంలో వాణిజ్య వాహనాలలో అగ్రగామిగా ఉన్న విషయం తెలిసిందే.. 150 బిలియన్ డాలర్ల విలువైన టాటా గ్రూప్‌లో టాటా మోటార్స్ కీలక సంస్థగా ఉంది. ఈ కంపెనీ గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. ఈ కంపెనీ టర్నోవర్ 44 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతీయ వాణిజ్య వాహనాల సెక్టార్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది.ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో మొదటి మూడు స్థానాల్లో ఉంది. ముడి సరుకుల ధరలు పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని కంపెనీ పేర్కొంది. కాగా.. ఈ సంవత్సరం ప్రారంభంలో టాటా మోటార్స్ లిమిటెడ్, ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల కారణంగా 2024 ఏప్రిల్ 1 నుండి ధరలను రెండు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.
Read Also: China Rains: చైనాలో భారీ వర్షాలు.. ఎమర్జెన్సీ పొడిగింపు
టాటా మోటార్స్ దేశంలోని ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ. ఇది ట్రక్కులు, బస్సులు మరియు ఇతర వాణిజ్య వాహనాలను తయారు చేస్తుంది. ఈ ఏడాది వాణిజ్య వాహనాల ధరలను టాటా మోటార్స్ పెంచడం ఇది మూడోసారి. ఇంతకు ముందు జనవరి 1 నుంచి వాణిజ్య వాహనాల ధరలను 3% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఆరు నెలల్లోనే మూడోసారి మరో 2 శాతం ధరలు పెంచుతోంది. అంటే మొత్తంగా ఈ ఏడాదిలోనే టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల ధరలు ఏకంగా 7 శాతం మేర పెరిగాయి.
- Tags
- increase
- July 1
- prices
- TATA Motors
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..