విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే.. కామాంధుడిగా మారాడు. బాలికలతో దురుసు, అసభ్యంగా ప్రవర్తించాడు ఓ టీచర్. హిమాచల్‌ప్రదేశ్‌లో బాలికలతో దురుసుగా మాట్లాడిన ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. టీచర్‌పై విద్యార్థినులు చేసిన ఆరోపణలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జోగిందర్‌నగర్ సబ్ డివిజన్‌లోని లడ్‌బాడోల్ ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలకు చెందిన నలుగురు బాలికలు నిందితుడైన ఉపాధ్యాయుడిపై శనివారం ఫిర్యాదు చేశారు. చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్-1098లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బాధిత నలుగురు విద్యార్థినులను పోలీసులు పరామర్శించారు.
Crime News: తాగొచ్చిన భర్తను పొడిచి చంపిన భార్య.. సలసల కాగే నూనె పోసేసింది..
కాగా.. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు జోగీందర్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో అశ్విని కుమార్ తెలిపారు. నిందితుడైన ఉపాధ్యాయుడిని మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు పంపింది. సోమవారం మరోసారి కోర్టులో హాజరుపరచనున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పాఠశాలకు వచ్చిన విద్యార్థినుల పట్ల కామంతో ప్రవర్తించేవాడు ఆ ఉపాధ్యాయుడు. ఈ క్రమంలో.. విద్యార్థినుల ప్రైవేట్ పార్ట్స్ చూపించమని అడిగేవారని బాధిత విద్యార్థినులు తెలిపారు. అంతే కాకుండా.. వారికి కూడా తన ప్రైవేట్ పార్ట్స్ కూడా చూపించేవాడని చెప్పారు. బాధితుల్లో ఇద్దరు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కాగా, మరో ఇద్దరు ఆరో తరగతి విద్యార్థులు ఉన్నారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల చేతికి చైనా ప్రత్యేక పరికరం(అల్ట్రా సెట్)..
ఈ ఘటనపై విచారణలో భాగంగా.. పోలీసులు విద్యార్థినుల కుటుంబ సభ్యులను కలిశారు. జరిగిన విషం గురించి సమాచాం అందించారు. మరోవైపు.. ఈ విషయంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని అఖిల భారతీయ జనవాది మహిళా సమితి జోగీందర్‌నగర్ యూనిట్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని కమిటీ సభ్యులు ఆరోపించారు.