అమర్‌నాథ్ యాత్ర ఈరోజు (శనివారం) ప్రారంభమైంది. శ్రీనగర్‌లోని హిమాలయాల్లో ఉన్న బోలేనాథుడి దర్శనం కోసం బాల్టాల్, నునావన్ క్యాంపుల మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. హిమాలయాల్లోని దక్షిణ కశ్మీర్‌లో సుమారు 3880 మీటర్ల ఎత్తులోని ఓ గుహలో భక్తులు మంచు శివలింగాన్ని దర్శనం చేసుకోనున్నారు. నువాన్-పహల్గామ్ రూట్లో 48 కిలోమీటర్లు, బల్తాల్ రూట్లో 14 కిలోమీటర్ల మార్గంలో భక్తులు వెళ్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ కాసేపట్లో కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా.. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు బయల్దేరిన పవన్ కు.. అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. మొదటగా తుర్కపల్లి దగ్గర పవన్ కల్యాణ్ కు జనసేన, బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ కు గజమాలతో ఘనంగా సన్మానించారు అభిమానులు. ఈ సందర్భంగా.. ఓపెన టాప్ కారు నుంచి పవన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. బీజేపీ కార్యకర్తలు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా…
ఈరోజు ఇండియా-సౌతాఫ్రికా మధ్య టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. టాస్కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు పిచ్ను పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు బార్బడోస్‌లో వర్షం పడే అవకాశం ఉంది.. దీంతో మ్యాచ్ మధ్యలోనే ఆగిపోవచ్చు. అయితే భారీ వర్షం కారణంగా ఈరోజు మ్యాచ్ పూర్తికాకపోతే రిజర్వ్ డే ఉంది. ఇక.. బార్బడోస్ పిచ్ గురించి చెప్పాలంటే…
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో శుక్రవారం భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.. సౌత్ గ్లాసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. మరోవైపు.. గాయపడ్డ 15 మంది కార్మికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒడిశా, బీహార్, యూపీ నుంచి వచ్చిన కార్మికులు ఈ కంపెనీలో ఎక్కువగా పని చేస్తున్నారు. మృతులంతా బీహార్, ఒడిశా, యూపీ వాసులే. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రం అయ్యాయి. పేలుడు ధాటికి కంపెనీకి చెందిన షెడ్ కుప్పకూలింది.…
రేపు(ఆదివారం)మధ్యాహ్నం డీఎస్ స్వంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. డి. శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. డీఎస్కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ మ్యాచ్.. ఈరోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఇరుజట్లు ట్రోఫీని సొంతం చేసుకోవాలనే కసితో ఉన్నాయి. 11 సంవత్సరాల తర్వాత ట్రోఫీని ముద్దాడేందుకు రోహిత్ సేన చూస్తుండగా.. దక్షిణాఫ్రికా కూడా మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్‌ను గెలువాలని చూస్తోంది. ఇదిలా ఉంటే.. 2024 టీ20 ప్రపంచకప్‌కు ఐసీసీ ఇప్పటికే ప్రైజ్‌మనీ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈసారి ప్రైజ్ మనీ గణనీయంగా పెరిగింది. అయితే..…
హైదరాబాద్ పాతబస్తీలో మళ్లీ కత్తిపోట్లు కలకలం రేపుతున్నాయి. కొందరు యువకులు కలిసి ఇంటి ముందు క్యాంప్ ఫైర్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే పక్కనే ఉండే వారు తమకు అల్లర్లు, గోలలతో ఇబ్బందిగా ఉందని ప్రశ్నించారు. దీంతో.. యువకులకు, వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో.. మండుతున్న క్యాంప్ ఫైర్ లోని కట్టెలతో అబ్దుల్లా ఖాన్, వసిమ్ అనే యువకులపై సమీర్, జమిర్, సయ్యద్ అనే యువకులు దాడి చేశారు. వెంటనే.. విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహంతో కత్తులతో దాడికి…
మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. డీఎస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ (TS DSC 2024) పరీక్ష షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. జులై 18 నుంచి ఆగస్టు 5వరకు CBRT విధానంలో రోజుకు రెండు షిఫ్ట్లలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. డీఎస్సీ పరీక్షలో జనరల్ నాల్డెజ్, టీచింగ్ తో పాటు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగతా 20 మార్కులకు టెట్(TS TET ) వెయిటేజ్ ఉంటుంది.…