నేడు వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి.. 1.30 కి వరంగల్ కు చేరుకుంటారు. అక్కడ.. మేఘా టెక్ట్స్ టైల్ పార్క్ ని పరిశీలిస్తారు. ఆ తర్వాత సెంట్రల్ జైలులో నిర్మాణం చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తారు. ఆ తర్వాత హన్మకొండ కలెక్టరేట్లు వహించనున్న గ్రేటర్ వరంగల్ పై రివ్యూ మీటింగ్ చేపట్టనున్నారు. సాయంత్రం అక్కడి నుంచి బయల్దేరి బేగంపేట ఎయిర్ పోర్టుకు హెలికాప్టర్లో చేరుకోనున్నారు.
నేడు కొండగట్టు అంజన్నను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కొండగట్టుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో కొండగట్టుకు చేరుకోనున్నారు. తమ ఇలవేల్పు కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పని చేశారు. డి.శ్రీనివాస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. తమను వదిలి వెళ్లిపోవద్దంటూ టీచర్ను పట్టుకుని విద్యార్థులు ఏడ్చేశారు. ఈ ఘటన మద్దిరాల (మం) పోలుమల్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మెంతబోయిన సైదులును పట్టుకొని విద్యార్థులు ఏడ్చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని.. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ల పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ తెలిపారు.
శనివారం దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్స్ కోసం టీమిండియా బార్బడోస్‌లో అడుగుపెట్టింది. (ANI) X ఖాతాలో అప్‌లోడ్ చేసిన వీడియోలో.. భారత జట్టులోని సభ్యులు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ వంటి పలువురు విమానాశ్రయం నుండి వారి బస్ ఎక్కేందుకు వెళ్తుండటం చూడొచ్చు. జట్టు సభ్యులతో పాటు.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కూడా విమానాశ్రయం నుండి బయటకు వస్తున్నట్లు వీడియోలో కనిపించారు.
డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర ఏబీవీపీ ఆందోళన చేపట్టారు. సంవత్సరాల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సమస్యల పైన నిత్యం విద్యార్థి పరిషత్ నుండి అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకోవడంలేదనీ నిరసన వ్యక్తం చేశారు.
రేపు ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్, కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టైటిల్ పోరుకు ముందే క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ వస్తోంది. జూన్ 29న బార్బడోస్‌లో వర్షం పడే సూచన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉందా? వర్షం…
హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటిని యువజన విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకల పై ఎన్టీఏని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ తిరుకు నిరసనగా నేతలు ముట్టడించారు. నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలంటూ.. మళ్లీ తిరిగి ఎగ్జామ్ పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నీట్ సమస్య పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్‌సభలో ప్రసంగిస్తూ దేశంలోని వృద్ధులకు శుభవార్త చెప్పారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. 70 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ పథకం కింద చికిత్స అందజేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ ఈ హామీ ఇచ్చింది. కొత్త ప్రభుత్వంలో 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ ప్రయోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్రపతి ముర్ము గురువారం పార్లమెంట్ హౌస్‌లో తెలిపారు. అంతేకాకుండా.. రైతుల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. రైతులకు రూ.20 వేల…