Atrocious: రూ.10 కోసం బాలుడి దారుణ హత్య..
- రూ.10 కోసం బాలుడి దారుణ హత్య
- యూపీలోని మొరదాబాద్లో ఘటన
- స్విమ్మింగ్ పూల్‌కు వచ్చిన బాలుడు
- రూ.10 ఇవ్వలేదన్న కారణంతో గొంతు నులిమి చంపిన యజమాని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూ.10 కోసం ఓ బాలుడిని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌కు వచ్చిన బాలుడు రూ.10 ఇవ్వలేదన్న కారణంతో పూల్ యజమాని తండ్రీ కొడుకులు బాలుడి గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత.. బాలుడి నోరు, ముక్కులో ఇసుక నింపారు. హత్య చేసిన అనంతరం సమీపంలోని చెరకు తోటలో పడేశారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడైన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌కుమార్, అతని కుమారుడు వీర్‌పాల్‌లు పొలంలోనే అక్రమంగా స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. అయితే.. ఆ పూల్ లోకి వెళ్లాలంటే 10 రూపాయలు ఇవ్వాల్సిందే. కాగా.. ఆ గ్రామానికి చెందిన సీమా యాదవ్ 11 ఏళ్ల కుమారుడు ఆయుష్ యాదవ్ రోజూ పూల్ వద్దకు వెళ్లేవాడు. అందులోకి వెళ్లి డబ్బులు ఇవ్వకుండా తరచూ పారిపోయేవాడు. అయితే.. బుధవారం సాయంత్రం స్నానం చేయమని ఆయుష్‌ను ఇంటి నుంచి పంపించింది. తిరిగి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లి ఆందోళనకు గురైంది. ఆమె స్విమ్మింగ్ పూల్‌లో బాలుడి కోసం వెతకడానికి వెళ్లినా అతని జాడ కనిపించలేదు. సీమ తన బంధువులతో కలిసి స్విమ్మింగ్ పూల్ చుట్టుపక్కల పొలాల్లో కొడుకు కోసం వెతికింది. బంధువులు ఆయుష్ కోసం రాత్రంతా వెతికారు. అయితే.. కొలనుకు 15 మీటర్ల దూరంలోని చెరుకు తోటలో బాలుడి మృతదేహం లభ్యమైంది.
Airtel: నిన్న జియో, నేడు ఎయిర్‌టెల్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలు..
డీఐజీ మునిరాజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి సీమ నుంచి సమాచారం తీసుకున్నారు. రూ.10 ఇవ్వలేదని స్విమ్మింగ్ పూల్ యజమాని రాజ్‌కుమార్, అతని కుమారుడు వీర్‌పాల్ తన నోటిలో, ముక్కులో ఇసుకను పోసి గొంతుకోసి హత్య చేశారని సీమ ఆరోపించింది. ఈ ఘటనపై వీర్‌పాల్‌ను విచారిస్తున్నట్లు నగర ఎస్పీ అఖిలేష్ భదౌరియా తెలిపారు. త్వరలో అతని తండ్రిని కూడా అరెస్టు చేయనున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారించారు.
తాజావార్తలు
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..