Rohit Sharma: విజయం తర్వాత రోహిత్ శర్మ ఎమోషనల్.. (వీడియో)
- సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించిన భారత్
- ఆనందంలో రోహిత్ శర్మ ఎమోషనల్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్పిన్నర్ల మాయాజాలంతో టీ20 ప్రపంచ కప్ 2024 రెండవ సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. లక్ష్యాన్ని చేధించడానికి రంగంలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ చేతులెత్తేయడంతో 16.3 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో.. టీమిండియా ఫైనల్స్కు చేరింది. ఈ ఆనందంలో రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
రోహిత్ భావోద్వేగానికి లోనైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డగౌట్ లో కూర్చున్న అతడిని కోహ్లీతో పాటు ఇతర సహచర ఆటగాళ్లు భుజంపై తట్టి ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. చివరిసారిగా 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించిన సంగతి తెలిసిందే.
Read Also: Vande Bharat Express: వందేభారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం 130 కి.మీకి తగ్గింపు..
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 39 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు ఇది మూడో అర్ధ సెంచరీ. ఈ టోర్నీలో టీం ఇండియా ఐదోసారి సెమీఫైనల్ మ్యాచ్‌ను ఆడి విజయం సాధించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది.
Rohit Sharma got emotional and was crying after the win, Virat Kohli came to give him a high five ❤️🥹#INDvsENG | #T20WorldCup | #RohitSharma | #ViratKohli pic.twitter.com/1ShILLq8N2
— CricWatcher (@CricWatcher11) June 27, 2024
తాజావార్తలు
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!