టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ను చిత్తు చిత్తుగా ఓడించింది. దీంతో.. భారత్ ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. 68 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. 16.4 ఓవర్లలోనే ఇంగ్లండ్ను 103 పరుగులకు ఆలౌట్ చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. భారత్ బౌలర్ల ధాటికి తడబడ్డారు. కేవలం జాస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, హ్యారీ బ్రూక్ ఈ ముగ్గురే 20 పరుగుల మార్కును దాటారు. మిగతా వాళ్లంతా తక్కువ స్కోరుకే ఔటయ్యారు. భారత్ బౌలర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ను ముప్పు తిప్పలు పెట్టారు.
ఇంగ్లండ్ బ్యాటింగ్లో ఫిల్ సాల్ట్ (5), జాస్ బట్లర్ (23), మొయిన్ అలీ (8), బెయిర్ స్టో డకౌట్, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్ (2), లివింగ్ స్టోన్ (11), క్రిస్ జోర్డాన్ (1), జోఫ్రా ఆర్చర్ (21), ఆదిల్ రషీద్ (2), టోప్లీ (3) పరుగులు చేశారు. ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత.. బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.
Read Also: Heavy rains: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
భారత్ బ్యాటింగ్లో రోహిత్ శర్మ (57) అర్ధ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత.. సుర్య కుమార్ యాదవ్ (47) పరుగులు చేశాడు. హార్ధిక్ పాండ్యా (23), రవీంద్ర జడేజా (17), అక్షర్ పటేల్ (10), విరాట్ కోహ్లీ (9), రిషబ్ పంత్ (4) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలింగ్ లో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. టోప్లీ, ఆర్చర్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ పై సూపర్ విక్టరీ సాధించిన భారత్.. రేపు ఫైనల్స్లో సౌతాఫ్రికాతో తలపడనుంది.