అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. సుమారు ఐదు నిమిషాల పాటు అమరావతి విధ్వంసంపై వీడియో రిలీజ్ చేశారు. కాగా.. వీడియో ప్లే అవుతున్నప్పుడు సీఎం చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరావతి విధ్వంసం జరిగిన తీరు చూస్తుంటే బాధ కలుగుతోందని తెలిపారు. ఎంతో ఆలోచించి ప్రణాళికలు వేస్తే.. సర్వ నాశనం చేశారని ఆరోపించారు.
రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే వారు అమరావతినే రాజధానిగా అంగీకరిస్తారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. కరుడు గట్టిన తీవ్రవాది కూడా అమరావతికే ఆమోదం తెలుపుతారని పేర్కొన్నారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలని అందరూ చెబుతున్నారని.. అమరావతి చరిత్ర సృష్టించే నగరం అని చంద్రబాబు తెలిపారు.
టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ టైటిల్ సాధించిన విజయం తెలిసిందే.. దీంతో దాదాపు 17 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. జూన్ 29న బార్బడోస్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఉత్కంఠ భరిత విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తుఫాన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన టీమిండియా, ఈరోజు బార్బడోస్ నుంచి స్వదేశానికి బయల్దేరింది. సుమారు 16 గంటల ప్రయాణం తర్వాత గురువారం ఉదయం 6.00 గంటలకు భారత ఆటగాళ్లు ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానున్నారు. ఈ నేపథ్యంలో…
ఏపీలో ఓ అత్యాచార ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వీరబల్లి మండలం ఓదివీడు గ్రామం దూళ్ళ హరిజనవాడలో జరిగింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. తిరిగి ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఫ్రీగా ఇసుక అందించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం.. కలెక్టర్ల అధ్యక్షతన లోడింగ్, రవాణ ఛార్జీల నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. కాగా.. ఇంతకుముందు ఉచిత ఇసుక విధానాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. గత…
మీరు మంచి కెమెరాతో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. హానర్ నుండి వస్తున్న స్మార్ట్ ఫోన్ ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో 200MP కెమెరాతో కలిగి ఉంది. దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో విక్రయించబడుతోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను రూ.12,000 కంటే ఎక్కువ తగ్గింపుతో అమ్ముతుంది. ఈ ఫోన్ ప్రత్యేకత దాని కెమెరా, ర్యామ్. మీరు 25,000 రూపాయలకు మంచి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ ఫోన్ మంచి ఎంపిక. ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం.
రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా అదరగొట్టింది. బార్బడోస్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని, 17 ఏళ్ల తర్వాత రెండో టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. కాగా.. ఫైనల్‌కు ముందు భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు కెప్టెన్ రోహిత్ చెప్పిన మాటలను స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు బయటపెట్టాడు.
రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. నాగౌర్ జిల్లా ఖిన్వ్‌సర్ ప్రాంతంలోని చరదా గ్రామంలో కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. చెరువులో మునిగి ఒక వివాహిత.. ఆమె ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు. సమాచారం అందుకున్న భవంద పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను వెలికితీసి ఖిన్వసర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకు తరలించారు. మృతులు తల్లి లీల, కూతుళ్లు కనిక, కృష్ణగా గుర్తించారు. అయితే.. లీలా భర్త తనను కొట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
టీమిండియా ఈరోజు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. టీ20 ప్రపంచకప్ కారణంగా ఈ టూర్‌కు యువ జట్టును ఎంపిక చేశారు. ఈ టీమ్‌లోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో సత్తా చాటిన ప్లేయ్లకు అవకాశం కల్పించారు. అలాగే.. జట్టు కెప్టెన్సీ పగ్గాలు శుభ్‌మన్ గిల్ చేతికి అందించారు. అయితే.. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. గిల్ జట్టుతో కలిసి జింబాబ్వే వెళ్లలేదు. టీమిండియా జింబాబ్వే పర్యటనకు సంబంధించి బీసీసీఐ తన X హ్యాండిల్ తెలిపింది. NCA చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ జట్టుకు కోచ్‌గా ఉన్నారు. అతను టీమిండియాతో…
ఇండియాకు చెందిన సూర్యన్ ఆదిత్య-ఎల్1 అంతరిక్షంలో మరో చరిత్ర సృష్టించింది. ఆదిత్య ఎల్-1 తన మొదటి హాలో ఆర్బిట్‌ను పూర్తి చేసింది. ఇది ఆదిత్య L1 మొదటి పునరావృతం. 178 రోజుల్లో ఒక రౌండ్ పూర్తయిందని మంగళవారం ఇస్రో ట్వీట్ చేసింది. ఈ రోజు ఆదిత్య-L1 పాయింట్ చుట్టూ తన మొదటి హాలో కక్ష్యను పూర్తి చేసింది. 2024 జనవరి 6న ప్రవేశించిన తర్వాత, ఒక విప్లవాన్ని పూర్తి చేయడానికి 178 రోజులు పట్టింది.