Sexual Harassment: రూ.50 ఎర చూపి మైనర్ బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల శిక్ష
- ఉత్తరాఖండ్లో దారుణం
- ఓ మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై కోర్టు కఠిన చర్యలు
- నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
- రూ. 5000 జరిమానా విధింపు
- బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా.. జరిమానా కూడా విధించింది. ఈ కేసులో ప్రత్యేక, జిల్లా సెషన్స్ జడ్జి ధరమ్ సింగ్ తీర్పు చెప్పారు. రూ. 5000 జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో 30 రోజుల అదనపు సాధారణ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తన నిర్ణయంలో పేర్కొంది. బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ POCSO మోహన్ పంత్ మాట్లాడుతూ.. ఈ ఘటన 2020 మే 13న సాయంత్రం 4 గంటలకు జరిగింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మైనర్ బాలికకు ఫోన్ చేసి.. ఆమెకు రూ. 50 ఇచ్చి సమీపంలోని దుకాణంలో కొన్ని వస్తువులను తీసుకురమ్మని చెప్పాడు.
Read Also: AP Assembly Session: అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైన ప్రభుత్వం.. పూర్తిస్థాయి బడ్జెట్ లేనట్టే..!?
Also Read
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
అయితే.. ఆ వస్తువులు తీసుకుని నిందితుడి ఇంటికి వెళ్లగా.. నిందితుడు ఆమెను తన గదిలోకి ఈడ్చుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. అంతేకాకుండా.. బాలికను దారుణంగా కొట్టాడు. దీంతో బాలిక శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. అనంతరం.. బాధితురాలి తల్లి, కుటుంబ సభ్యులు నిందితుడి గదికి చేరుకున్నారు. దీంతో.. వెంటనే నిందితుడు బాలికను వదిలిపెట్టాడు. ఈ ఘటనపై గ్రామపెద్దలు రెవెన్యూ సబ్ ఇన్‌స్పెక్టర్ గౌచర్‌కు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రెవెన్యూ సబ్ ఇన్‌స్పెక్టర్ గౌచర్ నిందితుడిని అరెస్టు చేశారు. కాగా.. ఇన్ని రోజుల పాటు జైల్లో ఉన్న నిందితుడికి కోర్టు కీలక తీర్పునిచ్చింది.
Read Also: Kamal Haasan: ఇంకా దొరకని అవార్డ్స్ చాలా ఉన్నాయి..కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!