Fridge: ఈ పదార్థాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. జాగ్రత్త..!
- ఈ పదార్థాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా..
- ఫ్రిజ్‌లోని చల్లదనం వల్ల ఆయా ఆహార పదార్థాలు పోషకాలు కోల్పోతాయి..
- ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు రిఫ్రిజిరేటర్లో పెడుతాం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఎవరి ఇంట్లో చూసినా ఫ్రిజ్ ఉంటుంది. అయితే ఫ్రిజ్‌ను ఉపయోగించే సమయంలో తెలిసో తెలియకో మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. మరీ ముఖ్యంగా ఎండకాలంలో బయట ఏ ఆహారాన్ని ఉంచినా త్వరగా పాడైపోతాయి. దీంతో వాటిని ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అందులో పెడితే ఫ్రెష్‌గా ఉంటాయని భావిస్తాం. అయితే.. ఫ్రిజ్‌లోని చల్లదనం వల్ల ఆయా ఆహార పదార్థాలు పోషకాలు కోల్పోతాయనే సంగతి మీకు తెలుసా? కొన్ని పదార్థాలైతే తమ స్వభావాన్ని కోల్పోవడమే కాదు.. విషంగా మారతాయి. ఈ నేపథ్యంలో ఫ్రిజ్‌లో ఏయే ఆహార పదార్థాలను ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
Damodar Raja Narsimha: గాంధీ, ఉస్మానియా బలోపేతానికై ఫార్మా కంపెనీలు ఆ నిధులను అందించాలి..
Also Read
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
అరటి పండ్లు
చాలా మంది అరటిపండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు రిఫ్రిజిరేటర్లో పెడుతుంటారు. అయితే.. అరటి పండ్లు ఫ్రిజ్ లో పెట్టడం వల్ల నల్లగా మారుతాయి. అంతే కాదు.. వాటి చుట్టూ ఉంచిన పండ్లు, కూరగాయలు కూడా పాడవుతాయి. ఇథిలీన్ అనే వాయువు వల్ల ఇది జరుగుతుంది. అందుకే అరటి పండ్లను ఎప్పుడూ బహిరంగ ప్రదేశంలో ఉంచాలి.
ఉల్లిపాయ-టమోటా
ఇతర కూరగాయల్లాగే.. మీరు కూడా ఉల్లిపాయలు, టొమాటోలను రిఫ్రిజిరేటర్‌లో పెడితే ఆపేయండి. ఎందుకంటే.. వాటి ఆకృతి త్వరగా పాడవడమే కాకుండా, ఫ్రిజ్ వాటి లోపల తేమను గ్రహిస్తుంది. విటమిన్-సి తగ్గిపోయి.. రుచిని సైతం కోల్పోతుంది.
బ్రెడ్
బ్రెడ్ లేదా దాని ఉత్పత్తులను రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు. వీటిలో ఉండే ఈస్ట్ చల్లదనానికి పాడైపోవడం మొదలవుతుంది. ఈ క్రమంలో.. ఫ్రిజ్ లో ఉంచిన బ్రెడ్ తిన్నట్లైతే.. జీర్ణక్రియ దెబ్బతింటుంది.
ఊరగాయ
చాలా మంది ఫ్రిజ్‌లో ఊరగాయలను ఉంచుతాతారు. అలా చేయడం వల్ల అది ఫంగస్ ఏర్పడుతుంది. దీంతో.. అందులో ఉచిన వస్తువులను కూడా పాడుచేస్తుంది. ఫ్రిజ్‌లో ఉంచిన ఇతర వస్తువులలో దాని వాసన పోయి.. మిగతా వాటిని నాశనం చేస్తుంది.
బంగాళదుంప
బంగాళాదుంపలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచినప్పుడు వాటిలో ఉండే స్టార్చ్ చక్కెరగా మారుతుంది. అంతేకాకుండా.. గట్టిగా మారుతుంది. సులభంగా కట్ చేయడానికి రాదు. దీంతో.. బంగాళదుంప రుచి పోతుంది. బంగాళాదుంపలు ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండాలంటే పేపర్ బ్యాగ్‌లో పెట్టండి.
తాజావార్తలు
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!