కర్ణాటకలోని యాదగిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను అంగీకరించడం లేదని పదహారేళ్ల యువతి దారుణానికి ఒడిగట్టింది. యువకుడి మూడు నెలల కోడలును బావిలో పడేసి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జూలై 6వ తేదీన జరిగింది. యువతికి పాప మేనమామ యల్లప్పతో గత రెండేళ్లుగా ఇష్టపడుతుంది. అంతేకాదు.. ఐదుసార్లు ప్రపోజ్ కూడా చేసింది. అయితే.. యల్లప్ప తమ కుటుంబ సంబంధాల గురించి చెబుతూ పలుమార్లు ఆమె ప్రేమను తిరస్కరించాడు.
Read Also: Harom Hara OTT: ఓటీటీకి వచ్చేస్తున్న హరోం హర.. ఎప్పుడు? ఎక్కడ? చూడాలంటే!
ఎల్లప్పపై కోపం పెంచుకున్న యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో 3 నెలల పాపను బావిలో పడేసి చంపేసింది. తర్వాత పాప తల్లిదండ్రులు.. తన కోసం వెతకగా పాపను ఎవరో తీసుకెళ్లారని చెప్పి వారిని తప్పుదారి పట్టించింది. కాగా.. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించగా.., అసలు నిజాలు బయటపడ్డాయి. యువతి యల్లప్పను నేరానికి పాల్పడే ఉద్దేశంతోనే చిన్నారిని బావిలోకి పడేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also:Hathras stampede: హత్రాస్ తొక్కిసలాటపై సుప్రీంలో పిటిషన్..రేపు విచారించినున్న సీజేఐ
పాప మేనమామ అంటే తనకు ఇష్టం ఉండటం, అతనికి ప్రియురాలు ఉండడంతో పగ తీర్చుకునేందుకే ఇలా చేసిందని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. వీరంతా ఒకే ఇంట్లోనే ఉంటారని తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి యువతి నేరాన్ని అంగీకరించింది. దీంతో.. యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.