CNG Cars: రూ. 10 లక్షల కంటే తక్కువ ధరకు లభించే టాప్-5 సీఎన్జీ కార్లు ఇవే..!
- రూ. 10 లక్షల కంటే తక్కువ ధరకు లభించే టాప్-5 సీఎన్జీ కార్లు
- మారుతి సుజుకి వ్యాగన్ఆర్ CNG
- మారుతి సుజుకి ఆల్టో K10 CNG.. టాటా టిగోర్ CNG
- హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS CNG
- మారుతి సుజుకి S-ప్రెస్సో CNG.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల దృష్ట్యా ప్రజలు సీఎన్జీ (CNG) కార్ల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ కార్లు డబ్బులు ఆదా చేయడంతో పాటు పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే.. మీరు రూ.10 లక్షల లోపు సీఎన్జీ కారును కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే.. రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో కార్లు ఉన్నాయి. తక్కువలో దొరికే టాప్- 5 కార్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Election Commission: శరద పవార్ పార్టీకి ఊరట.. విరాళాలు సేకరణకు గ్రీన్‌సిగ్నల్
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
1. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ CNG
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సీఎన్‌జి ధర రూ. 6.44 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. సీఎన్జీతో పాటు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉంటుంది. ఈ కారు సీఎన్జీ మోడ్‌లో 76 bhp పవర్, 98 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ కిలోగ్రాముకు 34.04 కిలోమీటర్లు ఇస్తుంది. ఈ కారులో విలాసవంతమైన ఇంటీరియర్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సీఎన్జీ కార్లలో ఇది ఒకటి.
2. మారుతి సుజుకి ఆల్టో K10 CNG
మారుతి సుజుకి ఆల్టో కె10 సీఎన్‌జి ధర రూ. 5.96 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ కారులో 998సీసీ ఇంజన్ కలిగి ఉంటుంది. దీని మైలేజ్ కిలోకు 33 కిలోమీటర్లు ఇస్తుంది. ఈ కారు చాలా పొదుపుగా ఉంటుంది. ఇందులో మీరు సులభంగా హ్యాండ్లింగ్, మంచి మైలేజీని పొందుతారు.
3. టాటా టిగోర్ CNG
టాటా టిగోర్ సీఎన్‌జి ధర రూ. 8.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది సీఎన్జీ మోడ్‌లో 84bhp శక్తిని, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మైలేజ్ కిలోగ్రాముకు 26.47 కిలోమీటర్లు ఇస్తుంది. ఈ కారులో ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇది విశాలమైన ఇంటీరియర్, మంచి లుక్స్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలిగి ఉంది.
4. హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS CNG
హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS సీఎన్జీ ధర రూ. 7.72 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ కారు.. సీఎన్జీ మోడ్‌లో 68 bhp పవర్, 95 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ కిలోగ్రాముకు 25.61 కిలోమీటర్లు.
5. మారుతి సుజుకి S-ప్రెస్సో CNG
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సీఎన్‌జి ధర రూ. 6.24 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ కారు సీఎన్జీ మోడ్‌లో 67 bhp పవర్, 90 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మైలేజ్ కిలోకు 32.12 కి.మీ.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..