రెడ్ మీ (Redmi) తన కస్టమర్ల కోసం కొత్త ఇయర్ బడ్స్ని పరిచయం చేసింది. రెడ్ మీ బడ్స్ 5C.. వైర్‌లెస్ ఆడియో పోర్ట్‌ఫోలియోను మెరుగుపరుస్తుంది. ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (TWS) అనేక ప్రత్యేక ఫీచర్లతో ముందుకు వస్తుంది. అంతేకాకుండా.. ధర కూడా తక్కువే ఉంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇది మొత్తం 36 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది. అంతేకాకుండా.. 40dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్, అద్భుతమైన సౌండ్ క్వాలిటీ ఉంది.
పంజాబ్‌లోని ఫజిల్కాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భర్త ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో భార్య.. కోపంతో అత్తగారింటి నుంచి వెళ్లిపోయింది. అయితే.. ఆమెకు నచ్చజెప్పి తన ఇంటికి తీసుకొద్దామని.. అత్తగారింటికి వెళ్లిన భర్తపై అత్తమామలు దాడికి పాల్పడ్డారు. అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా కాలిపోయాడు. మూడు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ట్రక్కు, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన ఓల్డ్ కంటోన్మెంట్ ప్రాంతంలోని మోరెనా హైవేపై తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరిగింది. కుటుంబ సమేతంగా ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
సామాన్యులు కూడా కార్లలో తిరుగాలనే ఉద్దేశ్యంతో కేవలం లక్ష రూపాయలకే కారును అందించింది టాటా కంపెనీ. టాటా నానో పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే.. ఆ కారుకు అనుకున్నంత ఆదరణ లభించకపోవడంతో కొన్ని రోజులకు కార్ల తయారీని నిలిపివేసింది. అయితే.. మళ్లీ రీలాంఛ్ చేసేందుకు కంపెనీ యోచిస్తుంది. అది కూడా ఎలక్ట్రికల్ కారు.. టాటా నానో ఈవీకి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు అధికమవుతున్నాయి.
గురువారం తెల్లవారుజామున వారణాసిలో ఒకే బైక్‌పై రీల్స్ చేస్తూ వెళ్తున్న ముగ్గురు యువకులు బస్సును ఢీకొట్టారు. దీంతో.. వారు వంద మీటర్ల దూరంలో పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాద వార్త తెలియగానే మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన SV792 విమానం పాకిస్థాన్‌లోని పెషావర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగాయి. ల్యాండింగ్ గేర్‌లో సమస్య కారణంగా టైర్‌కు మంటలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. మీడియా నివేదికల ప్రకారం.. మొత్తం 276 మంది ప్రయాణికులు, 21 మంది సిబ్బంది విమానంలో ఉన్నారు.
బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్ ఫ్రీడమ్ 125 ను జూలై 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత.. ఇప్పుడు టీవీఎస్ (TVS) మోటార్ కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదటి గ్రౌండ్-అప్ సీఎన్జీ స్కూటర్‌ను తయారు చేయాలని యోచిస్తోంది. టీవీఎస్ మోటార్ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా వివిధ ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలపై పని చేస్తోంది.
మనం తినే ఆహారంలో అనేక మసాలా దినుసులను ఉపయోగిస్తాము. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. పసుపు కూడా ఈ సుగంధ ద్రవ్యాలలో ఒకటి. దీనిని ఆహారం రంగు, రుచిని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా పసుపును పొడి రూపంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
చివరి టీ20లో భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈరోజు (మంగళవారం) దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం చేసింది. మొదటి మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలుపొందగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. చివరి మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.
పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని.. ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటను తప్పేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.