Retail inflation: 4 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం.. కారణమిదే..?
- 4 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం
- జూన్‌లో 5.08 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
- జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆహార వస్తువుల ధరల పెరుగుదల కారణంగా జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.08 శాతానికి పెరిగింది. మే నెలలో ద్రవ్యోల్బణం 4.75 శాతంగా ఉంది. అంతకుముందు ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 4.85 శాతంగా ఉంది. కాగా.. జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను గణాంకాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. డేటా ప్రకారం.. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం జూన్‌లో 9.36 శాతానికి పెరగగా, ఈ ఏడాది మేలో 8.69 శాతానికి పెరిగింది. గతేడాది జూన్‌లో ఇది 4.35 శాతంగా ఉంది. జూన్ నెలలో చాలా ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే జూన్ నెలలో గ్రామీణ ద్రవ్యోల్బణం 4.78 శాతం నుంచి 5.67 శాతానికి పెరిగింది. గత మే నెలలో 5.34 శాతంగా నమోదైంది. పట్టణ ద్రవ్యోల్బణం గతేడాది జూన్ లో 4.96 శాతం ఉంటే.. గత నెలలో 4.39 శాతం నమోదైంది. గత మే నెలలో 4.21 శాతం రికార్డైంది. ఈ నెలలో కూరగాయలతో పాటు మాంసం, చేపలు, గుడ్లు, పప్పులు, వాటి ఉత్పత్తులతో పాటు తయారీ ఉత్పత్తుల ధరలు.. పాల ధరలు కూడా పెరిగాయి.
PM Modi: ‘‘సంవిధాన్ హత్య దివాస్’’పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
- Nirmala Sitharaman: "వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు".. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
- Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
- Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే బాధ్యతను ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్‌కు అప్పగించింది. CPI ద్రవ్యోల్బణం ఇరువైపులా 2 శాతం మార్జిన్‌తో 4 శాతం వద్ద ఉండేలా చూసుకునే బాధ్యతను ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)కి అప్పగించింది. పాలసీ రేట్లను నిర్ణయించేటప్పుడు ఆర్బీఐ ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. రిజర్వ్ బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా అంచనా వేసింది. తొలి త్రైమాసికంలో 4.9 శాతం, రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.6 శాతం, నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా అంచనా వేశారు.
Dharmendra Pradhan: రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అవుతారు.. !
గనులు, విద్యుత్ రంగాల మంచి పనితీరు కారణంగా ఈ ఏడాది మేలో దేశ పారిశ్రామికోత్పత్తి 5.9 శాతం పెరిగింది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (IIP) ఆధారంగా మే 2023లో 5.7 శాతం పెరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) డేటా ప్రకారం, మే 2024లో మైనింగ్ ఉత్పత్తి 6.6 శాతం మరియు విద్యుత్ ఉత్పత్తి 13.7 శాతం పెరిగింది. డేటా ప్రకారం, తయారీ రంగ ఉత్పత్తి వృద్ధి రేటు ఈ ఏడాది మేలో 4.6 శాతానికి క్షీణించింది.. ఈ ఏడాది ప్రారంభంలో 6.3 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-మే మధ్య కాలంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5.4 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే సమయంలో 5.1 శాతంగా ఉంది.

- Tags
- 4-month
- business news
- Food
- high
- June
తాజావార్తలు
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
-
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!