Tragic Incident: ఏం కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
- ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
- గుజరాత్‌లోని భన్వాడ్‌లోని ధారగఢ్ ప్రాంతంలో ఘటన
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ద్వారకా జిల్లాలోని భన్వాడ్‌లోని ధారగఢ్ ప్రాంతంలో నలుగురి మృతదేహాలు కనిపించడంతో కలకలం రేగింది. వీరంతా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాల వద్ద పాయిజన్ బాటిల్, ప్లాస్టిక్ గ్లాసులు, కోలా డ్రింక్ బాటిల్‌తో పాటు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. మూడు మొబైల్ ఫోన్లు, పాన్ కార్డు, గుర్తింపు కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారు.
Read Also: Muchumarri Missing Girl Case: ముచ్చుమర్రి బాలిక కేసులో కీలక పరిణామం..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించగా.. ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. మృతి చెందిన నలుగురు వ్యక్తులు 42 ఏళ్ల అశోక్ ధుమ్వా, 42 ఏళ్ల లీలుబెన్ అశోక్ ధుమ్వా, 20 ఏళ్ల జిగ్నేష్ అశోక్ ధుమ్వా, 18 ఏళ్ల కింజల్ దుమ్వాగా గుర్తించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: Nepal: విశ్వాస పరీక్షలో ఓడిపోయిన నేపాల్ ప్రధాని ప్రచండ.. కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలి..?
రూ. 20 లక్షలు ఇవ్వాలని విశాల్ జడేజా అనే వ్యక్తి బెదిరింపులు, దాడులు, ఒత్తిడి చేశారని మృతుడి కుటుంబ పెద్ద అశోక్‌భాయ్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన కుటుంబంలోని నలుగురు సభ్యులు రెండు స్కూటర్లపై జామ్‌నగర్‌కు వెళ్లి భన్వాడ్‌లోని ధారగఢ్ గ్రామంలో విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ప్రాథమిక విచారణ ఆధారంగా విశాల్ జడేజాపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?