పావురాలను ఎక్కువగా ఇళ్లల్లో పెంచుకుంటారు. అంతేకాకుండా.. అవి ఇంటిపై స్థావరాలను ఏర్పరుచుకుని విశ్రాంతి తీసుకుంటాయి. కొన్ని చోట్ల రోడ్లపై వీపరీతంగా వాలుతూ కనిపిస్తుంటాయి. అయితే.. పావురం ఈకలు, రెట్టలతో ప్రమాదమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఒక అధ్యయనం ద్వారా వెలుగులోకి వచ్చింది. పావురం ఈకలు, రెట్టలతో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అధ్యయనంలో వెల్లడించింది. ముఖ్యంగా చిన్నారులు, యువత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
ఓ నివేదిక ప్రకారం.. ఈ అధ్యయనం ఢిల్లీలో ఒక అబ్బాయిపై చేశారు. పావురం ఈకలు, రెట్టలకు ఎక్కువగా గురికావడం వల్ల బాలుడు అలెర్జీకి గురయయాడు. అది అతనికి ప్రాణాంతకంగా మారింది. తూర్పు ఢిల్లీకి చెందిన 11 ఏళ్ల బాలుడిని సర్ గంగారామ్ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు అధ్యయనానికి సంబంధించిన వైద్యులు తెలిపారు. మొదట్లో అతని లక్షణాలు సాధారణ దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో బాలుడి పరిస్థితి విషమంగా మారింది. బాలుడిని పరీక్షించగా.. హైపర్‌సెన్సిటివిటీ న్యుమోనైటిస్ (హెచ్‌పీ)తో బాధపడుతున్నట్లు తేలిందని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ) వైద్యులు తెలిపారు. దీంతో.. చిన్నారికి తక్షణ చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది.
Shivam Bhaje: ఐదు సినిమాలకు పోటీగా అశ్విన్ బాబు శివమ్ భజే
హైపర్సెన్సిటివిటీ న్యుమోనిటిస్ అంటే ఏమిటి?
హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడే వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతారు. యువతలో ఈ పరిస్థితి సర్వసాధారణమని, అయితే పిల్లల్లో మాత్రం ఇది చాలా అరుదని అంటున్నారు. ఈ వ్యాధి ఏడాదిలో లక్ష మంది జనాభాలో ఇద్దరు నుంచి నలుగురికి సోకుతుందని అంచనా.
చిన్నారికి ఎలా చికిత్స అందించారు?
హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్‌తో బాధపడుతున్న బాలుడికి స్టెరాయిడ్ మందు ఇచ్చామని వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే హై ప్రెజర్ ఆక్సిజన్ థెరపీ ఇచ్చారు. ఈ థెరపీ ద్వారా, ముక్కులో ట్యూబ్‌ను చొప్పించి శరీరానికి ఆక్సిజన్ పంపించారు. ఈ థెరపీ పిల్లల ఊపిరితిత్తులలో వాపును తగ్గించడంలో.. శ్వాసను సాధారణ స్థాయికి తీసుకురావడంలో సహాయపడిందని అధ్యయనంలో చెప్పారు. చికిత్స యొక్క సానుకూల ప్రభావాలు, ఇంటెన్సివ్ కేర్ సూచనల కారణంగా అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.
హైపర్సెన్సిటివిటీ న్యుమోనిటిస్ ఎందుకు వస్తుంది?
పక్షి రెట్టలు, ఈకలు.. కొన్ని పర్యావరణ పదార్థాలకు పదేపదే బహిర్గతం కావడం వల్ల హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్ పరిస్థితి ఏర్పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఈ-సిగరెట్ స్మోకర్ ద్వారా వెలువడే పొగతో కూడా అలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. అందుకోసం.. పక్షి రెట్టలు, ఈకల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన ఇలాంటి వ్యాధులను అరికట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. పావురాలు, పౌల్ట్రీ పక్షులు చుట్టూ ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలని అంటున్నారు.