Uttar Pradesh: మామిడికాయల కోసమని వెళ్లిన చిన్నారులపై తోటమాలి దారుణ చర్య..
- ఉత్తరప్రదేశ్‌లోని పిపారియా గురు గోవింద్ రాయ్ గ్రామంలో దారుణం
- చిన్నారులను చెట్టుకు కట్టేసి నోటిలో మామిడి కాయ కొట్టిన తోటమాలి
- ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్
- తోటమాలిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని పిపారియా గురు గోవింద్ రాయ్ గ్రామంలో ఓ తోటమాలి దారుణ ఘటనకు పాల్పడ్డాడు. మామిడికాయలు కోయడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులపై బరితెగించాడు. తోటమాలి పిల్లలను తాడుతో చెట్టుకు కట్టేసి కొట్టాడు. ఈ వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు మేలుకుని.. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం తోటమాలిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.
ఈ ఘటన బుధవారం ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం పూట వాకింగ్ కు వెళ్లిన ముగ్గురు పిల్లలు పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్లారు. అక్కడ రాలిన కాయలను ఏరుకుంటుండగా.. పిల్లలు మామిడి కాయలను దొంగలిస్తున్నారనే ఉద్దేశ్యంతో తోటమాలి అక్కడకు వచ్చాడు. వచ్చి అంతటితో ఆగకుండా.. ముగ్గురు పిల్లలను పట్టుకుని చెట్టుకు తాడుతో కట్టేశాడు. ఆ తర్వాత వారి నోట్లో మామిడికాయలు కుక్కి మరీ చితకబాదాడు.
Also Read
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
- Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
IAS Vivek Yadav: ఏపీ సీఈవోగా సీనియర్ ఐఏఎస్ వివేక్ యాదవ్..
అయితే.. పిల్లలను చెట్టుకు కట్టేసి కొడుతున్నాడన్న సమాచారం గ్రామస్తులకు తెలిసి అక్కడ గుమిగూడారు. అక్కడే ఉన్న ఒకరు ఈ ఘటనను వీడియో తీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న చిన్నారుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని పిల్లలను తీసుకుని కలిసి ఇంటికి వెళ్లారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు క్షేత్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. తోటమాలి సహా ముగ్గురు వ్యక్తులు పిల్లలను కట్టేసి కొట్టారని ఆరోపిస్తూ ఓ చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తోటమాలిపై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లి డిమాండ్ చేసింది.
ఈ క్రమంలో.. చౌక్ పోలీస్ స్టేషన్‌లో తోట తోటమాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలను బంధించి చిత్రహింసలు పెట్టినందుకు మామిడి తోట యజమాని సుదర్శన్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీస్ స్టేషన్ హెడ్ ప్రశాంత్ కుమార్ పాఠక్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
ట్రెండింగ్
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?