Womens Asia Cup Final: శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న భారత్
- కాసేపట్లో భారత్-శ్రీలంక మధ్య ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- శ్రీలంకలోని దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాసేపట్లో భారత్-శ్రీలంక మధ్య ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంకలోని దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫైనల్లో విజయం సాధించి మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించి రికార్డు స్థాయిలో 8వ టైటిల్‌ను గెలుచుకోవాలని భారత జట్టు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన టోర్నీలో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఇప్పటి వరకు బాగానే రాణించారు. తమ ప్రత్యర్థి జట్లకు ఇంకా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
Read Also: Vishwak Sen: ఇన్‌స్టాగ్రామ్ డీ యాక్టివ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా..?
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఇప్పటి వరకు బాగానే రాణించారు. తమ ప్రత్యర్థి జట్లకు ఇంకా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఇప్పటివరకు జట్టుకు శుభారంభాలు అందించారు, అయితే బౌలర్లు ముఖ్యంగా దీప్తి శర్మ, రేణుకా సింగ్ ప్రదర్శన పట్ల టీమ్ మేనేజ్‌మెంట్ చాలా సంతోషంగా ఉంది. టోర్నీలో ఇప్పటివరకు దీప్తి అత్యధికంగా తొమ్మిది వికెట్లు పడగొట్టగా, రేణుక ఏడు వికెట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది.
Read Also: Kidnap Case: బ్యాంకాక్‌లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
మరోవైపు.. శ్రీలంక తరఫున కెప్టెన్ చమరి అటపట్టు అద్భుత ప్రదర్శన చేస్తుంది. ఆమె ఇప్పటివరకు 243 పరుగులు చేసింది, కానీ ఆమె తప్ప, మరే ఇతర శ్రీలంక బ్యాట్స్‌మెన్ 100 పరుగులను చేరుకోలేదు. భారత్ విజయాన్ని నమోదు చేసుకోవాలంటే శ్రీలంక కెప్టెన్‌ను నియంత్రించాల్సి ఉంటుంది. భారత్ పటిష్ట బ్యాటింగ్ లైనప్‌పై శ్రీలంక బౌలర్లకు గట్టి పరీక్ష ఎదురుకానుంది. ఆఫ్ స్పిన్నర్ కవిషా దిల్హరి (ఏడు వికెట్లు) మినహా ఇతర శ్రీలంక బౌలర్లు ఇప్పటివరకు ప్రభావం చూపలేకపోయారు.
ఇండియా ఉమెన్స్ ప్లేయింగ్ ఎలెవన్:
షఫాలీ వర్మ, స్మృతి మంధాన, ఉమా చెత్రీ (వికెట్ కీపర్/బ్యాటర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా సింగ్.
శ్రీలంక ఉమెన్స్ ప్లేయింగ్ ఎలెవన్:
విష్మి గుణరత్నే, చమరి ఆటపట్టు (కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, నీలక్షికా సిల్వా, హాసిని పెరీరా, కవిషా దిల్హరి, అనుష్క సంజీవని(వికెట్ కీపర్/బ్యాటర్), సుగందికా కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసల.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!