Tragedy: యూపీలో భారీ వర్షాలు.. ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతి
- ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో తీవ్ర విషాదం
- వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతి
- ఒకే కుటుంబానికి చెందిన వృద్ధురాలు.. ముగ్గురు బాలికలు
- మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో.. ఒకే కుటుంబానికి చెందిన వృద్ధురాలు, ముగ్గురు బాలికలు శిథిలాల కింద పడి చనిపోయారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తుండగా.. 11 ఏళ్ల బాలిక తన నానమ్మకు అతుక్కుపోయి కనిపించింది. శిథిలాల నుండి బయటకు తీసి వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Read Also: Sathya 27th Showroom: ఆఫర్లే.. ఆఫర్లు.. సత్యా 27వ షోరూం అనంతపురంలో ఘనంగా ప్రారంభం
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఈ ఘటన జైత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని కుప్పురా గ్రామంలో చోటు చేసుకుంది. రైతు రామ్ గోపాల్ ఇంట్లో గురువారం రాత్రి 8.30 గంటలకు జరిగింది. రామ్ గోపాల్.. అతని భార్య హాల్ లో నిద్రిస్తుండగా.. అతని తల్లి హోషియార్శ్రీ (64), ముగ్గురు కుమార్తెలు సప్న (16), జూలీ (13), అన్షిక (11)తో పాటు కుమారులు శివ, ఆనంద్ గదిలో నిద్రిస్తున్నారు. అయితే భారీ వర్షానికి రాత్రి ఒక్కసారిగా గది పైకప్పు కూలిపోయింది. పైకప్పు కూలిన వెంటనే పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినిపించడంతో గ్రామస్థులు రామ్ గోపాల్ ఇంటి వైపు పరుగులు తీశారు. అక్కడి దృశ్యాన్ని చూసి జనం వణికిపోయారు. వెంటనే శిథిలాల తొలగింపు ప్రారంభించారు.
Read Also: Rohit Sharma: ‘నేను మీ కెప్టెన్ రోహిత్‌ని’.. అభిమానులకు హిట్ మ్యాన్ సందేశం
శిథిలాల కింద రామ్‌గోపాల్ తల్లితో పాటు అతని ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సమాధి అయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. అక్కడి చేరుకున్న పోలీసులు, గ్రామస్థుల సహకారంతో శిథిలాలను తొలగించారు. శిథిలాల కింద ఒకే మంచంపై అమ్మమ్మ, అన్షిక మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరూ ఒకరికొకరు అతుక్కుపోయారు. అమ్మమ్మ తనని రక్షించడానికి కౌగిలించుకున్నట్లు అనిపించింది. ఇద్దరు కుమారులతో పాటు సప్న, జూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తీసుకెళుతుండగా సప్న, జూలీ మృతి చెందారు. శివ, ఆనంద్‌లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!