Rajesh Veeramalla
Author- NTV Telugu-
Punjab: కాలుతున్న చితిలోకి దూకిన ఓ వ్యక్తి.. పరిస్థితి విషమం
పంజాబ్లోని జలంధర్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. జండియాల మంజ్కి సమీపంలోని సమ్రాయ్ గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా కాలిపోతున్న చితిలోకి దూకాడు. దీంతో.. అతనికి మంటలు అంటుకుని 70 శాతం కాలాయి. ఆ వ్యక్తిని జండియాలా మంజ్కి సమీపంలోని సమ్రాయ్ గ్రామానికి చెందిన బహదూర్ సింగ్ (50)గా గుర్తించారు. -
Breaking News: ఫైనల్లో మను భాకర్ ఓటమి..
పారిస్ ఒలింపిక్స్లో భారత్ మరో పతకాన్ని కోల్పోయింది. భారత స్టార్ షూటర్ మను భాకర్ మరో పతకం తృటిలో చేజారింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. హోరా హోరీగా సాగిన పోరులో అద్భుతంగా రాణించిన మను.. 4వ స్థానంలో నిలవడంతో పోటీ నుంచి ఎలిమినేట్ అయింది. -
Moon Drifting Away: భూమికి దూరంగా వెళ్తున్న చంద్రుడు.. రోజుకు 25 గంటలే..!
చంద్రుడు లేకుండా భూమిపై జీవుల ఉనికిపై చాలా దూర ప్రభావాలను కలిగి ఉండవచ్చు. చంద్రుడు మన భూమికి దూరంగా వెళ్తున్నాడని శాస్త్రీయ అధ్యయనంలో పేర్కొన్నారు. చంద్రుడు సంవత్సరానికి దాదాపు 3.8 సెంటీమీటర్ల చొప్పున దూరం కదులుతున్నాడు. ఇదే ట్రెండ్ కొనసాగితే భూమిపై ఒక రోజు 25 గంటలు ఉంటుంది. 1.4 బిలియన్ సంవత్సరాల క్రితం, భూమిపై ఒక రోజు అంటే 18 గంటల కంటే కొంచెం ఎక్కువగా ఉండేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో లవ్ ప్రపోజల్.. వీడియో వైరల్
పారిస్ ఒలింపిక్స్ లో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్రవారం జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి హువాంగ్ యా కియోంగ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే, తన ఆనందం దానికే పరిమితం కాలేదు. స్వర్ణం గెలిచిన వెంటనే తోటి ఆటగాడు ఆమెకు ప్రపోజ్ చేశాడు. డబుల్స్ ప్లేయర్ యుచెన్ మెకాళ్లపై కూర్చుని ఉంగరంతో ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. దీంతో.. హువాంగ్ ఆశ్చర్యం, ఆనందంతో ఓకే చెప్పింది. పారిస్ ఒలింపిక్స్‌లో లవ్ ప్రపోజల్ ఇదే తొలిసారి. కాగా.. ఈ క్యూట్ వీడియో… -
Today Gold Rate: మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
ఆడవారికి గుడ్ న్యూస్.. మూడు రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 6,470 ఉంది. అలాగే.. 8 గ్రాముల బంగారం ధర రూ. 51,760 ఉంది. 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 64,700 గా ఉంది. నిన్నటి ధర కంటే.. ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్లపై బంగారం ధర రూ. 100 తగ్గింది. -
PM Modi: ఆగస్టు 9-15 మధ్య ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి.. ప్రధాని పిలుపు
త్రివర్ణ పతాకానికి రంగులు వేసిన పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ సెల్ఫీ తీసుకుని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయాలని ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నారని ప్రధాని రాశారు. 'మనకు త్రివర్ణ పతాకాన్ని అందించడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. హర్ ఘర్ తిరంగ ఉద్యమానికి మద్దతు ఇవ్వండి. ఆగస్టు 9 నుండి 15 మధ్య త్రివర్ణ పతాకాన్ని… -
Paris Olympics 2024: ఇమానే ఖలీఫ్ తర్వాత మరో వివాదాస్పద బాక్సర్..
పారిస్ ఒలింపిక్స్‌లో లింగ అర్హత అంశం చర్చనీయాంశమైంది. గురువారం జరిగిన మహిళల 66 కేజీల విభాగంలో అల్జీరియాకు చెందిన ఇమానే ఖలీఫ్ ఇటలీకి చెందిన ఏంజెలా కారినిపై విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభమైన 46 సెకన్లకే మ్యాచ్ నుంచి వైదొలగాలని కారిని నిర్ణయించుకుంది. ఖలీఫ్ మాత్రమే కాదు.. ఆ ఛాంపియన్‌షిప్‌లో మరొకరిని అదే కారణంతో తొలగించారు. ఆమె తైవాన్‌కు చెందిన లిన్ యు-టింగ్. లిన్ యు కూడా పారిస్‌లో జరిగిన తన ప్రారంభ మ్యాచ్‌లో మహిళల 57 కేజీల విభాగంలో ఏకగ్రీవ పాయింట్ల నిర్ణయంతో… -
Employment: వ్యవసాయ రంగంలో 25 కోట్ల మందికి ఉపాధి.. 17 ఏళ్లలో అత్యధికం
2022-23లో వ్యవసాయం, వేట, అటవీ మరియు చేపల వేటలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 25.3 కోట్ల స్థాయికి చేరుకుంది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. గత 17 ఏళ్లలో ఇదే గరిష్ఠ స్థాయి. FY 2022-23 మధ్య వ్యవసాయ ఉపాధి 25 కోట్లను దాటింది. అలాగే.. గత నాలుగేళ్లలో 5 కోట్ల మందికి పనులు లభించాయి. 2022-23లో వ్యవసాయ రంగంలో 48 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. తయారీ, వాణిజ్యంలో 44 లక్షలకు పైగా ఉద్యోగాలు పొందారు. -
Wayanad Landslide: విపత్తుతో పోరాడి నెలన్నర పసికందు, ఆరేళ్ల బాలుడిని రక్షించిన తల్లి
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 40 రోజుల పసికందు.. ఆమె ఆరేళ్ల సోదరుడు ప్రాణాల కోసం పోరాడుతుండగా.. వారిద్దరినీ రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వరదల్లో కొట్టుకుపోయారు. వారి ఇల్లు కూడా ధ్వంసమైంది. అయితే.. ఆ కుటుంబంలో పసికందు అనారా, సోదరుడు మహ్మద్ హయాన్ సురక్షితంగా బయటపడ్డారు. -
ICAE: నేడు 32వ వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ సదస్సు.. ప్రారంభించనున్న ప్రధాని
శనివారం 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు (ఐసీఏఈ)ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. 65 ఏళ్ల తర్వాత భారత్‌లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. డిజిటల్ వ్యవసాయం, స్థిరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థలను ఇందులో ప్రదర్శించనున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?