దేశ రాజధాని ఢిల్లీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం జహంగీర్‌పురి పారిశ్రామిక ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలొ ఒకరు మృతి చెందగా.. మరో నలుగురిని శిథిలాల కింద నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) చీఫ్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు నలుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించామన్నారు. మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మధ్యాహ్నం 12:51 గంటలకు తమకు అత్యవసర కాల్ వచ్చిందని, ఆ తర్వాత ఐదు ఫైర్ టెండర్లను ఘటనా స్థలానికి పంపించామని DFS చీఫ్ చెప్పారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారన్న అనుమానంతో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Read Also: Stock Markets: వరుస లాభాలకు బ్రేక్.. భారీగా పతనమైన మార్కెట్లు
కాగా.. వారంలో ఇది రెండో ఘటన. గత వారం నిర్మాణంలో ఉన్న ఒక ప్రయివేట్ ఆస్పత్రి భవనం బేస్‌మెంట్ గోడ కూలింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ద్వారకా నార్త్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పెట్రోలింగ్ సమయంలో పెట్రోల్ పంప్ సమీపంలో సెక్టార్ 12లో నిర్మాణంలో ఉన్న భవనం బేస్‌మెంట్ సమీపంలో కొందరు గుమిగూడినట్లు గుర్తించారు.
Read Also: Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్..