కన్న కొడుకు నుండి రక్షణ కల్పించండంటూ, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు ఓ సీఐ తల్లిదండ్రులు. నలుగురికి రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను ఓ సీఐ వేధిస్తున్నాడు. కొడుకు నుండి రక్షణ కల్పించాలంటూ బాధిత తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీని కలిసి కొడుకు పై ఫిర్యాదు చేశారు.
పారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు రొమేనియాను ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. 16వ రౌండ్ లో రొమానియాను 3-2 తేడాతో ఓడించింది. ఒలింపిక్స్ TTలో భారత్ ఉమెన్స్ జట్టు క్వార్టర్స్ చేరుకోవడం ఇదే తొలిసారి.
లాస్ ఏంజెల్స్-న్యూయార్క్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తలపై పేను కనిపించడంతో ఫీనిక్స్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎతాన్ జుడెల్సన్ (Ethan Judelson) అనే ప్రయాణికుడు (UpTicketTalk)లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. విమానం ల్యాండింగ్ గురించి విమానంలో ఉన్న సిబ్బంది సమాచారం ఇవ్వలేదని.. దీని కారణంగా ప్రయాణికులు చాలా ఆశ్చర్యపోయారని అతను చెప్పాడు.
దేశంలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతోంది. అందులో గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ ఇలాంటి అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. ఇవన్నీ అకాల మరణాల ప్రమాదానికి దారి తీస్తాయి. ఈ సమస్యల బారిన యువత కూడా పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కాగా.. అనేక దీర్ఘకాలిక వ్యాధులను సకాలంలో పరిష్కరించి చికిత్స చేస్తే వాటి కారణాలను తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైంది. 241 పరుగుల లక్ష్యాన్ని సాధించడంలో భారత్ బ్యాటర్లు విఫలమయ్యారు. 42.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. దీంతో.. శ్రీలంక 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ప్రజావాణి ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉన్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం సచివాలయంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టుకు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో మచ్చ బొల్లారంకి చెందిన కన్నయ్య (22) ఉన్నాడు. మరో ఇద్దరు కొంపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కన్నయ్య అనే వ్యక్తి కారులోనే విహారయాత్రకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం రంగాపూర్ శివారు దర్గా రోడ్డు మూల మలుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళుతున్న మహిళ, ఇద్దరు బాలురకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోని మృతి చెందారు. వీరు చంద్రయాన్ గుట్ట వాసులుగా గుర్తించారు. వీరిలో హజరత్ బేగం (35), అబ్దుల్ రహమాన్ (12) సంఘటన స్థలంలోని మృతి చెందినట్లు సానికులు తెలిపారు. రహీం (9) పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.
హైదరాబాద్ మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి సమీపంలోని దుర్గం చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు నంబూరి చాణిక్య వర్మగా గుర్తించారు. నంబూరి చాణిక్య వర్మ (24) మాదాపూర్ లోని చందా నాయక్ తండ వాసిగా గుర్తించారు. కాగా.. చాణక్య వర్మ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేసేవాడు.. మొన్న తన రూమ్ నుండి వెళ్లిన చాణక్య వర్మ ఇంటికి రాకపోయేసరికి అతనికి తెలిసిన వారి వద్ద…