లాస్ ఏంజెల్స్-న్యూయార్క్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తలపై పేను కనిపించడంతో ఫీనిక్స్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎతాన్ జుడెల్సన్ (Ethan Judelson) అనే ప్రయాణికుడు (UpTicketTalk)లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. విమానం ల్యాండింగ్ గురించి విమానంలో ఉన్న సిబ్బంది సమాచారం ఇవ్వలేదని.. దీని కారణంగా ప్రయాణికులు చాలా ఆశ్చర్యపోయారని అతను చెప్పాడు. ఈ సంఘటన జూన్‌లో జరిగింది.
Read Also: Simba Movie: మొక్కలు నాటండి.. ఫ్రీగా సింబా సినిమా చూసేయండి!
ఎతాన్ జుడెల్సన్ అనే వ్యక్తి ఒక వీడియోలో తన అనుభవాన్ని పంచుకున్నాడు. “నేను చుట్టూ చూశాను, ఎవరూ కిందపడి లేరు. ఎవరూ భయపడటం లేదు. భయానక పరిస్థితులు ఏమీ లేవు. విమానంలో ఉన్న వాళ్లందరం దిగాం.” ఒక మహిళ తలపై పేను కనిపించిందని.. దీంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు ఇతర ప్రయాణీకులు మాట్లాడుకుంటే విన్నట్లు జుడెల్సన్ చెప్పాడు.
Read Also: CM Chandrababu: పోర్టుల నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
“ఇద్దరు బాలికలు మహిళ తలపై పేను కనిపించినట్లు నివేదించారు. విమానం ల్యాండింగ్ తర్వాత.. ప్రయాణీకులకు 12 గంటల ఆలస్యం అవుతుందని సమాచారం అందించారు. వారికి హోటల్ వోచర్లు కూడా అందించారు” అని జుడెల్సన్ టిక్‌టాక్ వీడియోలో తెలిపాడు. “మేము ఫీనిక్స్‌లో దిగిన వెంటనే, మాకు హోటల్ వోచర్‌తో కూడిన ఇమెయిల్ వచ్చింది.” అని పేర్కొ్న్నాడు. ఈ ఘటనపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలిపింది. తర్వాత ప్రయాణికులందరినీ లాస్ ఏంజెల్స్‌కు తరలించారు.