పారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది. ఫ్రీక్వార్టర్స్ లో 50 కేజీల విభాగంలో ప్రపంచ నంబర్ వన్, 2020 టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ జపాన్ రెజ్లర్ సుసాకితో తలపడి 3-2 తేడాతో విజయం సాధించింది.
OPPO ఇటీవలే భారతీయ మార్కెట్లో తన కొత్త K సిరీస్ ఫోన్ 'OPPO K12x 5G'ని విడుదల చేసింది. ఈ ఫోన్ క్వాలిటీ, కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లేతో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. అంతేకాకుండా.. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ పొందింది.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వెంటనే బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చారు. అయితే.. ఆమె మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లడం కష్టమనే తెలుస్తుంది. ఈ క్రమంలో.. షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ జాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా తన కుటుంబం అభ్యర్థన మేరకు.. తన భద్రత కోసం దేశం విడిచిపెట్టినట్లు ఆయన చెప్పారు. 76 ఏళ్ల హసీనా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనల మధ్య రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారని అన్నారు.
జమ్మూకశ్మీర్‌లో వచ్చే నెల (సెప్టెంబర్)లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సమైఖ్య రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఐదేళ్ల క్రితం ఇదే రోజున ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిందని ఆయన చెప్పారు. ఇది జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్ దాని గూఢచార సంస్థ ISI కార్యకలాపాలను చాలా వరకు అరికట్టిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రెవెన్యూ శాఖపై రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల భద్రతపై సిసోడియా ఆందోళన వ్యక్తం చేశారు. అనుమానస్పద రిజిస్ట్రేషన్లపై కలెక్టర్లు విచారణ జరిపించాలని సిసోడియా తెలిపారు. భూ రికార్డులను భద్రపరిచాలి.. రెవెన్యూ కార్యాలయాల్లో, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంట్లను జాగ్రత్త చేయాలని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా పేర్కొన్నారు.
పారిస్ ఒలింపిక్స్ లో భారత స్టార్ రెజ్లర్ నిషా దహియా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. మహిళల 68 కిలోల బరువు విభాగంలో ఉత్తర కొరియాకు చెందిన పాక్ సోల్ గమ్‌తో తలపడింది. అయితే, ఈ పోటీ నిషాకు చాలా బాధాకరంగా మారింది. మూడు నిమిషాల తర్వాత 8-2తో ఆధిక్యంలోకి వెళ్లిన నిషా.. మ్యాచ్ ముగియడానికి 33 సెకన్లు ఉండగా నిషా గాయపడింది. దీంతో మ్యాచ్ నిలిపివేసి ఆమె చేతికి బ్యాండ్ కట్టారు. అయితే.. బ్యాండ్ కట్టిన గానీ.. నొప్పితోనే తలపడింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. బాలికను ఓ హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా.. ఈ ఘటన మొత్తం నిందితుడి స్నేహితులు వీడియో తీశారు. వీడియో తీసిన అనంతరం బాలికను బెదిరించి తన వద్ద నుంచి డబ్బు, ఉంగరం తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
జైలులో తనకు నాసిరకం ఆహారం ఇస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాకిస్తాన్ లోని పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ ఆదేశాల మేరకే తనకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీని కారణంగా తన ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తక్షణమే హెల్త్ చెకప్ చేయాలనే డిమాండ్ కూడా ఆయన లేవనెత్తారు.
మీ ల్యాప్‌టాప్ చార్జింగ్ త్వరగా అయిపోయి ఇబ్బంది పడుతున్నారా.. అందుకోసం కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ పాటిస్తే, బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. నేటి కాలంలో ల్యాప్‌టాప్తో చాలా ఉపయోగం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా.. ఆఫీస్ నుంచి పని చేసినా.. ఆన్‌లైన్ క్లాసులైనా ఇప్పుడు ల్యాప్‌టాప్‌లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సినిమాలు, గేమ్స్‌కు లాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా ల్యాప్‌లు బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి. కానీ చాలా మంది ల్యాప్‌టాప్ బ్యాటరీ చాలా త్వరగా అయిపోతుందని.. ఈ క్రమంలో కొన్నిసార్లు కొన్ని ముఖ్యమైన పనులు…
తాజ్ మహల్ భద్రత మరోసారి విఫలమైంది. గంగాజలం అందించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సోమవారం తాజ్ కాంప్లెక్స్‌లో ఓ మహిళ గంగాజలాన్ని సమర్పించి.. శివుడి ఫోటోతో కూడిన జెండాను కూడా ఎగురవేసింది. వెంటనే ఈ విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న సీఐఎస్ఎఫ్ జవాన్లు మహిళను పట్టుకున్నారు. కాగా.. ఆ మహిళ జెండా ఎగురవేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.