ఉప్పల్-నారపల్లి నిలిచిపోయిన నూతన ఫ్లై ఓవర్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పరిశీలించారు. 2018లో ప్రారంభమై నేటికి ఫ్లై ఓవర్ పనులు పూర్తికాలేదు. ఐదేళ్ళైనా ఫ్లై ఓవర్ పూర్తి కాకపోవడం కారణాలపై నేషనల్ హైవే అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షించారు.
భారత్-శ్రీలంక మధ్య కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో రెండో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 240 పరుగులు చేసింది. భారత్ ముందు 241 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో (40), కామింధు మెండీస్ (40), దునిత్ వెల్లలాగే (39), కుశాల్ మెండీస్ (30) పర్వాలేదనిపించారు.
హైదరాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేబుల్ బ్రిడ్జిపై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. బ్రిడ్జి పైన డివైడర్ ని ఢీ కొట్టి కింద పడటంతో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే.. ఈ ప్రమాదం ఓవర్ స్పీడ్తో డ్రైవింగ్ చేయడం వల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారు.
'ప్రాణాలతో ఉండి మా పిల్లలను బాగా చూసుకోలేకపోయాం... దగ్గరివారు ఎవరైనా మా పిల్లలను బాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను.. ఇద్దరం మా ఇష్ట ప్రకారం ఆత్మహత్య చేసుకుంటున్నాం...' అని ఓ హోటల్లో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకుంది.
హైదరాబాద్ అబిడ్స్లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ కామర్షియల్ కంప్లెక్స్ రెనవేషన్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తాజ్ మహాల్ హోటల్ పక్కనే ఉన్న బిల్డింగ్లో ఈ ఘటన జరిగింది. అయితే పక్కనే ఒ వెల్డింగ్ షాపు ఉండటంతో.. వెల్డింగ్ చేస్తుండగా నిప్పు రవ్వల వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫోర్త్ సిటీ’ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి.. రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్, పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు మించి వెళ్లలేకపోయింది. పారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గెన్ పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన మహిళల 75 కేజీల క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి, వరల్డ్ నెంబర్-1 బాక్సర్ లీ కియాన్ చేతిలో 1-4 తేడాతో ఓటమి పాలయ్యారు.
పగలు, రాత్రి తేడా లేకుండా విచక్షణారహితంగా కస్టమర్లను మద్యం సేవించడానికి మరియు గదులలో ఉండడానికి అనుమతిస్తూ, ఎలాంటి ధృవ పత్రాలు లేకుండా హోటల్ గదులలో ఉండడానికి అనుమతిస్తూ, చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహించడము ద్వారా.. పరోక్షముగా స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్న శ్రీరస్తు బార్ & రెస్టారెంట్ మరియు హోటల్ ప్రాంగణాన్ని (బొమ్మరిల్లు కాంప్లెక్స్) సీపీ సుధీర్ బాబు మూసివేతకు ఆదేశించారు.
పారిస్ ఒలింపిక్స్ హాకీ క్వార్టర్స్లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. బ్రిటన్తో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో మొదట ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. ఆ తర్వాత షూటౌట్ జరిగింది. అందులో బ్రిటన్ జట్టు కొట్టే గోల్స్ను అడ్డుకోవడంలో కాస్త తడబడిన భారత్ ఆటగాళ్లు అందుకు ధీటుగా గోల్స్ చేశారు. షూటౌట్ 4-2 తేడాతో భారత్ విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది. దీంతో.. షూటౌట్‌లో బ్రిటన్‌ను ఓడించి భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి ఒలింపిక్స్లో…
ఇప్పుడు ఇమానే మహిళల బాక్సింగ్‌లో 66 వెయిట్ కేటగిరీ సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. ఆమె దేశానికి పతకాన్ని (కాంస్యం) అందించింది. ఆమె క్వార్టర్ ఫైనల్స్‌లో హంగేరీకి చెందిన అనా లుకా హమోరీని 5–0తో ఓడించింది. దీంతో.. అల్జీరియా ఏడో పతకాన్ని గెలుచుకున్న బాక్సర్‌గా నిలిచింది. మహిళల బాక్సింగ్‌లో అల్జీరియాకు ఇదే తొలి ఒలింపిక్ పతకం. ఖలీఫ్, లిన్ కూడా 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో పోటీలో పాల్గొన్నారు కానీ పతకం సాధించలేదు. అయితే.. తాజాగా విజయం, పతకం ఖాయం చేసుకున్న ఇమానే బాక్సింగ్ రింగులోనే కన్నీళ్లు పెట్టుకుంది.