వివాదాస్పద సంఘటన తర్వాత రెజ్లర్ అంతిమ్ పంఘల్ ఓ వీడియోను విడుదల చేసింది. తన అక్రిడిటేషన్ రద్దు గురించి మాట్లాడుతూ.. తన సోదరిని ఒలింపిక్ క్యాంపస్లోకి ప్రవేశించడానికి తన అక్రిడిటేషన్‌ను ఉపయోగించినట్లు చెప్పింది. కాగా.. మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీల తొలి రౌండ్‌లో అంతిమ్ పంఘల్ తొలి మ్యాచ్ లో 0-10తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత తన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని అంతిమ్ పంఘల్ చెప్పింది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో ఈరోజు (13వ రోజు) భారత్‌కు ప్రత్యేకమైనది. కాంస్య పతక పోరులో భారత హాకీ జట్టు నేడు స్పెయిన్‌తో తలపడనుంది. వాల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన పీఆర్ శ్రీజేష్ తన చివరి మ్యాచ్లోనూ పతకం సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
మహిళలు తమ పిల్లలకు పాలు ఇవ్వకపోవడం అనే ట్రెండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఆసుపత్రుల్లో నవజాత శిశువులు పుట్టిన తర్వాత.. దాదాపు 30 శాతం మంది మహిళలు స్వచ్ఛందంగా లేదా కొన్ని కారణాల వల్ల తల్లిపాలు ఇవ్వడం లేదు. గత రెండు మూడేళ్లుగా తల్లిపాలు ఇవ్వని మహిళల సంఖ్య వేగంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. 100 మందిలో ఒక మహిళ ప్రసవం తర్వాత తన బిడ్డకు పాలివ్వాలనుకునేదని, కానీ పాలు ఉత్పత్తి లేకపోవడంతో ఆమెకు తల్లిపాలు ఇవ్వలేకపోతున్నారని గైనకాలజిస్టులు చెబుతున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలు సాధించగా, మూడింటికి కాంస్యం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్‌తో కలిసి మను, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాలను సాధించారు. కాగా.. రెండు పతకాలు సాధించిన మను భాకర్ను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ సత్కరించారు. మంగళవారం పారిస్‌లోని ఇండియన్ హౌస్‌లో ఆమె…
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ (55).. అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన.. 1993లో ఇంగ్లాండ్ తరుఫున అంతర్జాతీయ అరంగ్రేటం చేశాడు. 100 టెస్టులు, 82 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో గ్రాహం థోర్ప్ 16 సెంచరీలు సాధించాడు. అలాగే 6744 పరుగులు చేశాడు..
మన వంటగదిలో అల్లం వెల్లుల్లి వాడకం సర్వసాధారణం. అల్లం వెల్లుల్లి లేకుండా ఏ కూరను తయారు చేయలేము. మరీ ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే.. రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా.. అల్లం వెల్లుల్లి వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే.. అల్లం వెల్లుల్లిని వంటకాల్లో వాడేందుకు ముందుగానే తీసుకుని నిల్వ ఉంచుకుంటారు.
బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 10 మంది ఆటగాళ్లతో ఆడినప్పటికీ భారత హాకీ జట్టు మంచి ప్రదర్శన కనబర్చింది. పారిస్ ఒలింపిక్స్ సెమీ ఫైనల్‌లో మంగళవారం జర్మనీతో తలపడనుంది. కాగా.. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో భారత జట్టు జర్మనీని ఓడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. 44 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించాలని భారత జట్టు చూస్తుంది.
బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. కొత్త బజాజ్ చేతక్ 3201 ధర రూ. 1.29 లక్షలు. కాగా.. ఈ స్కూటర్ ఈ నెల 5వ తేదీ నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వేరియంట్‌లతో పోలిస్తే.. కొత్త చేతక్ 3201 డిజైన్, ఫీచర్ అప్‌డేట్‌ల రూపంలో ప్రత్యేక అప్‌గ్రేడ్‌లను పొందింది.
పారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్ కు చెందిన ప్రొవోకేషన్‌ను 7–5తో ఓడించింది. దీంతో.. సెమీస్ లోకి ప్రవేశించింది. కాగా.. ఈరోజు రాత్రి 10:15 గంటలకు సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్.కే అద్వానీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. దీంతో.. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. న్యూరాలజీ విభాగంలో చేరిన ఆయన.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అబ్జర్వేషన్‌లో ఉంచామని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు.