OPPO K12x 5G: తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్.. డిజైన్, లుక్ అదుర్స్
- ఒప్పో నుంచి 'OPPO K12x 5G' విడుదల
- అదిరిపోయిన క్వాలిటీ.. కెమెరా.. బ్యాటరీ.. డిస్ప్లే
- మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ పొందిన OPPO K12x 5G.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO ఇటీవలే భారతీయ మార్కెట్లో తన కొత్త K సిరీస్ ఫోన్ ‘OPPO K12x 5G’ని విడుదల చేసింది. ఈ ఫోన్ క్వాలిటీ, కెమెరా, బ్యాటరీ, డిస్ప్లేతో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. అంతేకాకుండా.. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ పొందింది. OPPO K12x 5G అద్భుతమైన 1600 ఛార్జ్ సైకిల్స్ తర్వాత దాని అసలు సామర్థ్యంలో 80% కంటే ఎక్కువ నిలుపుకోగలిగే 4 సంవత్సరాల కంటే ఎక్కువకాలం పనిచేసే గ్యారంటీ కూడా ఇస్తుంది. ఈ ఫోన్ కెమెరా డ్యూయల్ వ్యూ మోడ్‌తో వస్తుంది. అంటే ఫ్రంట్, బ్యాక్ కెమెరాలను ఒకేసారి వాడవచ్చు.
Minister Thummala: ఆగస్టు 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ.. మంత్రి కీలక ప్రకటన
Also Read
డిజైన్
మీరు నిజంగా లైట్, అల్ట్రా స్లిమ్ డిజైన్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. OPPO K12x 5G కేవలం 7.68mm ఉంటుంది. బ్యాటరీ పెద్దగా ఉన్నప్పటికీ, దాని బరువు 186 గ్రాములు మాత్రమే. 11-టన్నుల బస్కి సమానమైన తీవ్ర ఉష్ణోగ్రత మార్పులు , పీడన పరీక్షలను తట్టుకునే వరకు 1.4 మీటర్ల ఎత్తు నుంచి కింద పడిన కూడా ఈ ఫోన్ కు ఏం కాదు. దీని IP54 రేటింగ్ నీరు , ధూళి నుండి రక్షిస్తుంది, అయితే వినూత్నమైన స్ప్లాష్ టచ్ టెక్నాలజీ తడి వేళ్లతో కూడా మీరు ఈ ఫోన్ అపరేట్ చేసేలా చేస్తుంది. కాస్మిక్ ఫ్లాష్ లైట్‌తో వచ్చే ఈ ఫోన్ వెనుక ప్యానెల్లో వృత్తాకార డిజైన్‌లో కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్రీజ్ బ్లూ, మిడ్నైట్ వైలెట్ రంగులలో లభిస్తుంది.
OPPO K12x 5Gతో మీరు 360° డ్యామేజ్ప్రూఫ్ ఆర్మర్ బాడీని పొందుతారు. ఈ క్రమంలో.. ఫోన్ పొరపాటున కింద పడిపోయినా, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. OPPO ప్రత్యేకంగా రూపొందించిన అల్లాయ్ ఫ్రేమ్‌తో తయారు చేశారు. ఈ ఫోన్లో డబుల్ రీన్ఫోర్స్డ్ గ్లాస్ ఉన్నందున మీరు డిస్ప్లే గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. షాక్ శోషక ఫోమ్ కూడా ఫోన్లో ఇన్స్టాల్ చేయబడింది. అవి అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో కూడా సురక్షితంగా ఉండేలా చూస్తాయి. మిలిటరీ గ్రేడ్ MIL-STD-810H సర్టిఫికేషన్‌ను సాధించిన మొదటి ఫోన్ ఇదే. ఈ ఫోన్ IP54 రేటింగ్‌ను కూడా పొందింది.
బ్యాటరీ, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్
OPPO K12x 5G పెద్ద 5100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనితో మీరు కనీసం 335 గంటల పాటు కాల్స్ మాట్లాడవచ్చు. అంతే కాకుండా యూట్యూబ్‌లో 15.77 గంటలు వీడియోలు గడపవచ్చు. దాదాపు 10 గంటల పాటు మ్యూజిక్ వినవచ్చు. ఈ ఫోన్ లో మీరు 45W SUPERVOOCTM ఫాస్ట్ ఛార్జింగ్ పొందుతారు. ఇది బ్యాటరీని కేవలం 10 నిమిషాల్లో 30% వరకు మరియు 74 నిమిషాల్లో 100% వరకు ఛార్జ్ చేస్తుంది. OPPO K12x 5G యొక్క బ్యాటరీ జీవితం నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ. 1600 ఛార్జ్ సైకిల్స్ తర్వాత కూడా దాని సామర్థ్యంలో 80% మెయింటెయిన్ చేస్తుంది. బ్యాటరీ జీవితకాలాన్ని మెరుగుపరచడానికి, పాజిటివ్ ఎలక్ట్రోడ్పై డబుల్ లేయర్ కోటింగ్ మరియు నెగటివ్ ఎలక్ట్రోడ్పై ట్రిపుల్ లేయర్ కోటింగ్ ఉంటుంది. ఈ కోటింగ్ వల్ల ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఫోన్‌తో అందుబాటులో ఉన్న OPPO స్మార్ట్ ఛార్జింగ్ ఫీచర్ వినియోగదారుల ఛార్జింగ్ ప్యాటర్న్‌లను అర్థం చేసుకుంటుంది. దాని వల్ల బ్యాటరీని ఆప్టిమైజ్ చేస్తుంది.
క్లియర్ వ్యూ డిస్ప్లే
OPPO K12x 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.687 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే యొక్క గరిష్ట ప్రకాశం 1000 నిట్లు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో.. L1 వైడ్‌వైన్ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. ఈ క్రమంలో.. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ యొక్క HD కంటెంట్‌ను సౌకర్యవంతంగా చూడవచ్చు. డిస్ప్లే యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో 89.9% ఉంది. డిస్ప్లేతో స్ప్లాష్ టచ్ ఫీచర్ అద్భుతంగా ఉంది. ఎందుకంటే మీరు తడి చేతులతో కూడా ఫోన్‌ను ఉపయోగించవచ్చు. అల్ట్రా వాల్యూమ్ మోడ్ ఫోన్‌తో కూడా అందుబాటులో ఉంది. దీని సహాయంతో వాల్యూమ్‌ను 300% వరకు పెంచవచ్చు. అంటే రద్దీగా ఉండే లేదా శబ్దం చేసే ప్రదేశాల్లో మీకు వినోదానికి లోటు ఉండదని అర్థం.
పనితీరు
OPPO K12x 5Gలో Mediatek డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్ ఉంది. ఈ ప్రాసెసర్ కారణంగా ఈ ఫోన్ తక్కువ బ్యాటరీ శక్తిని ఉపయోగిస్తుంది. అంతేకాకుండా మంచి పనితీరును అందిస్తుంది. OPPO K12x 5G రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మొదటిది 6GB RAMతో 128GB స్టోరేజ్, రెండవది 8GB RAMతో 256GB నిల్వతో లభిస్తుంది. ఇందులో UFS 2.2 స్టోరేజ్ ఉంది. ఇది OPPO యొక్క RAM విస్తరణ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఇది RAMని 8GB వరకు పెంచుతుంది. SD కార్డ్ ద్వారా ఫోన్ నిల్వను 1TB వరకు విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా కలర్ఓఎస్ 14 అందుబాటులో ఉంది.
ప్రీమియం ఫీచర్
OPPO K12x 5G బడ్జెట్ ఫోన్ కావచ్చు. కానీ ఇది ప్రీమియం ఫోన్లతో కనిపించే AI లింక్‌బూస్ట్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫీచర్ యొక్క పెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఫోన్లో లిఫ్ట్ లేదా బేస్మెంట్లో ఉన్నప్పటికీ నెట్వర్క్ కొరత ఉండదు. అంతే కాకుండా.. ఈ ఫోన్ లో ఏదైనా నావిగేషన్ యాప్‌ని ఉపయోగించినప్పటికీ.. ఎటువంటి నెట్వర్క్ సమస్య ఉండదు. AI లింక్‌బూస్ట్ ఫీచర్ సహాయంతో అధిక వేగంతో డేటాను ఉపయోగించవచ్చు.
డ్యూయల్ వ్యూ మోడ్ కెమెరా
OPPO K12x 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో ప్రాథమిక లెన్స్ 32 మెగాపిక్సెల్‌లు, రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్‌లు. ముందు భాగంలో సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. OPPOHDR 3.0 కెమెరా సోపోర్ట్ కూడా ఉంది. కెమెరాతో పాటు AI పోర్ట్రెయిట్ రీటచ్ కూడా అందుబాటులో ఉంది. అత్యంత ప్రత్యేకమైన డ్యూయల్ వ్యూ కెమెరా మోడ్ ను కూడా కలిగి ఉంది. అందువల్ల ఫ్రంట్, బ్యాక్ కెమెరాలతో ఒకేసారి ఫోటో-వీడియోను షూట్ చేయవచ్చు.
ధర
OPPO K12x 5G ప్రారంభ ధర రూ. 12,999 ఉంది. ఈ ధరలో 6GB RAMతో 128GB స్టోరేజ్ ను పొందుతారు. రెండవ వేరియంట్ 8GB RAM, 256GB స్టోరేజ్ తో ఉంది. దీని ధర రూ.15,999 ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్, OPPO ఇ-స్టోర్.. మెయిన్‌లైన్ రిటైల్ అవుట్లెట్ల నుండి విక్రయించబడుతోంది. అంతేకాకుండా.. ఈ ఫోన్‌పై అనేక ఆఫర్లు నడుస్తున్నాయి.
తాజావార్తలు
-
CJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు బిగ్ రిలీఫ్..!
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
TTD Alert: తిరుమల భక్తులకు అలర్ట్.. అంతవరకు సిఫార్సు లేఖల దర్శనం బంద్..!
-
The Traitors Telugu :’చీప్.. మిడిల్ క్లాస్’.. వర్ష’పై శ్రీదేవి చౌదరి సంచలన వ్యాఖ్యలు.. ‘ట్రెయిటర్స్’లో ముదురుతున్న వివాదం!
-
BJP: తిరుగుబాటు కోసమే వియత్నాంకు రాహుల్ గాంధీ.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ.!
ట్రెండింగ్
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!