ఆసియా క్రీడల రజత పతక విజేత, తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి పారిస్ ఒలింపిక్స్లో ఆకట్టుకోలేకపోయింది. పరుగుల రాణిగా పేరొందిన 24 ఏళ్ల జ్యోతి యర్రాజి పారిస్ ఒలింపిక్స్ లో పతకం సాధించలేకపోయింది.
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు స్పెయిన్‌ను 2-1తో ఓడించింది. దీంతో.. కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కాగా.. విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. కాంస్య పతకం సాధించిన భారత జట్టుపై మోడీ గురువారం ప్రశంసలు కురిపించారు. ఈ ఘనత రాబోయే తరాలకు గుర్తుండిపోతుందని కొనియాడారు.
వెస్టిండీస్ లో ఆగష్టు 22 నుంచి 30 వరకు జరగనున్న మహిళల కరీబియన్ ప్రీమిమర్ లీగ్ (సీపీఎల్) టోర్నమెంట్ లో హైదరాబాద్‌కు చెందిన మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర ఎంపికైంది. ప్రణవి చంద్ర ఆతిథ్య ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తరుఫున ఆడేందుకు ఎంపికైంది. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు.
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. సెమీస్ లో ఓడిన భారత జట్టు.. కాంస్య పతక పోరులో స్పెయిన్ పై 2-1 తేడాతో విక్టరీ నమోదు చేసింది. దీంతో.. భారత్ ఖాతాలో మొత్తం 4 కాంస్య పతకాలు చేరాయి.
100 గ్రాముల అదనపు బరువుతో ఒలింపిక్ ఫైనల్కు అర్హత కోల్పోయిన వినేష్ ఫోగట్కు ఊరట లభించింది. సిల్వర్ మెడల్ పొందేందుకు వినేశ్ అర్హురాలేనని పారిస్ స్పోర్ట్స్ కోర్టు సమర్థించింది. ఆమె సిల్వర్ మెడల్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చునని అభిప్రాయపడింది.
యూపీలోని ఫిరోజాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యతో దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో భర్త భార్యను కట్టేసి కొట్టాడు. అంతేకాకుండా.. అన్నకు సాయం చేసేందుకు తమ్ముళ్లు సహకారం అందించారు. తీవ్రంగా ఆ మహిళను కొట్టడంతో చనిపోయింది. మహిళ మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించగా.. పోస్టుమార్టం నివేదికలో మహిళపై జరిగిన దారుణం బయటపడింది. పోస్టుమార్టంలో మహిళ పేగు దగ్గర ఎనిమిది అంగుళాల పైప్ లభ్యమైంది. రిపోర్టు చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.
విదేశీ మందుల విషయంలో కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా.. యూరోపియన్ యూనియన్ (EU)లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఔషధం విజయవంతమై అక్కడ డ్రగ్ రెగ్యులేటర్ నుండి అనుమతి పొందినట్లయితే.. ఆ ఔషధానికి భారత్ లో క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని తెలిపింది. అంటే తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన మందులను కూడా నేరుగా భారతదేశంలోనే విక్రయించవచ్చు.
దేశ ఆర్థిక రాజధాని ముంబై-అహ్మదాబాద్ మధ్య త్వరలో వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. రేపు (ఆగస్టు 9న) 20 కోచ్‌లతో తొలి వందేభారత్ రైలు ట్రయల్‌ని భారతీయ రైల్వే నిర్వహించబోతోంది. 130 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలును తొలిసారిగా ట్రయల్ చేయనున్నారు. అహ్మదాబాద్-వడోదర-సూరత్-ముంబై సెంట్రల్ మధ్య రైలు ట్రయల్ రన్ జరుగనుంది. ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల రెజ్లింగ్‌లో భారత ఆటగాడు అమన్ సెహ్రావత్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు. సెహ్రావత్ 12-0తో అల్బేనియాకు చెందిన జెలిమ్‌ఖాన్ అబాకరోవ్‌పై విజయం సాధించాడు.
ఒలింపిక్ క్రీడల సమయంలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) చర్యలు తీసుకుంది. మూడేళ్లపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.