బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వెంటనే బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చారు. అయితే.. ఆమె మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లడం కష్టమనే తెలుస్తుంది. ఈ క్రమంలో.. షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ జాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా తన కుటుంబం అభ్యర్థన మేరకు.. తన భద్రత కోసం దేశం విడిచిపెట్టి వెళ్లారని ఆయన చెప్పారు. 76 ఏళ్ల హసీనా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనల మధ్య రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారని అన్నారు.
Read Also: Kishan Reddy: వచ్చే నెలలో జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు..
ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన తల్లికి రాజకీయ పునరాగమనం ఉండదని జాయ్ చెప్పారు. ఆదివారం నుంచి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు, తన భద్రత కోసం దేశం విడిచి వెళ్లిపోయిందన్నారు. నివేదిక ప్రకారం.. తన తల్లి బంగ్లాదేశ్‌ను 15 సంవత్సరాలు పాలించిందని జాయ్ చెప్పారు. ఇప్పుడు తాను ఎంత కష్టపడి పనిచేసినా మైనారిటీలు తనపై ఆగ్రహంతో ఉన్నట్లు చెప్పారు.
Read Also: Mamata banerjee: బంగ్లాదేశ్ విషయంలో మోడీ సర్కార్ నిర్ణయాలకు మద్దతుగా ఉంటాం
బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో హసీనా రాజీనామాను డిమాండ్ చేస్తున్న నిరసనకారులు.. అధికార అవామీ లీగ్ మద్దతుదారుల మధ్య ఆదివారం ఘర్షణలు తలెత్తాయి. కొన్ని రోజుల క్రితం.. పోలీసులు, ఎక్కువగా విద్యార్థుల నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలలో 200 మందికి పైగా మరణించారు. వారం రోజుల్లో కనీసం 300 మంది చనిపోయారు. 1971 యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాల పిల్లలకు బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు 30 శాతం కోటాను కేటాయిస్తూ షేక్ హసీనా సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన బాట పట్టారు.