దులీప్ ట్రోఫీ 2024 మొదటి రౌండ్ మ్యాచ్‌ల కోసం జట్లను ప్రకటించింది బీసీసీఐ. ఈ జట్లకు కెప్టెన్లుగా శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ ఉండనున్నారు. టీమ్ ‘A’కి గిల్, టీమ్ ‘B’కి ఈశ్వరన్, టీమ్ ‘C’కి గైక్వాడ్, టీమ్ ‘D’కి అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
రెడ్ బాల్ టోర్నమెంట్ అయిన దులీప్ ట్రోఫీతో భారత దేశవాళీ సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి చాలామంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్‌లో ఆడబోతున్నారు. ఇదిలా ఉంటే.. భారత సీనియర్ ఆటగాళ్లు కనిపించరు.. ఎందుకంటే భారత్ 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించి.. జట్టులో ఎంపికయ్యే ఆటగాళ్లను దులీప్ ట్రోఫీకి దూరంగా ఉంచనున్నారు. ఈ క్రమంలో.. కొంతమంది యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించనున్నారు. ఈ టోర్నీ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి.
Read Also: Snake Enter In Bank: విశాఖ స్టీల్ ప్లాంట్లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పాము కలకలం..
టోర్నీ తొలి రౌండ్‌కు నాలుగు జట్లు ఇవే..
టీమ్ A: శుభమన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ , విదావత్ కవరప్ప, కుమార్ కుశాగ్రా మరియు శాశ్వత్ రావత్.
టీమ్ B: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి (ఫిట్‌నెస్‌కు లోబడి), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్ , ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తి మరియు ఎన్ జగదీసన్ (వికెట్ కీపర్).
టీమ్ C: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇందర్‌జీత్, హృతిక్ షౌకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, విశాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖాంబోజ్, హిమాన్షు మర్కండే, హిమాన్షు మర్కండే, (వికెట్ కీపర్) మరియు సందీప్ వారియర్.
టీమ్ D: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైదే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ భరత్‌పాండే, . (వికెట్ కీపర్) మరియు సౌరభ్ కుమార్.