దేశ రాజధాని ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో 8 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని.. రెస్క్యూ పనులు ప్రారంభించారు. అయితే.. అదృష్టవశాత్తూ మంటలు చెలరేగిన వెంటనే ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు భవనం నుంచి వెళ్లిపోయారు. దీంతో ప్రాణపాయం తప్పింది.
అయితే.. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. అందులో ఉన్న ఎల్‌పీజీ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. ఇద్దరు మినహా మిగిలిన వారందరూ డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. భవనంలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. ప్రాథమిక విచారణ అనంతరం షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. క్రైమ్ టీమ్‌తో పాటు ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం వరకు మంటలు అదుపులోకి వచ్చాయి.
Read Also: CM Revanth Reddy : ఎయిర్‌పోర్ట్‌కు దగ్గర్లో ఫోర్త్ సిటీని నిర్మించబోతున్నాం
ఈ ప్రమాద ఘటనపై ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. బికనీర్‌లోని గురుద్వారా రోడ్‌లోని కరోల్ బాగ్ వెనుక భవనంలో మంటలు చెలరేగినట్లు మధ్యాహ్నం 1.36 గంటలకు తమ బృందానికి సమాచారం అందిందని తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే మోతీనగర్, ప్రసాద్‌నగర్ నుంచి ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి.. మంటలు చెలరేగిన భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నాలుగు అంతస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.