Drug Smuggler: కడుపులో 63 డ్రగ్స్ క్యాప్సూల్స్.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో పట్టుబడ్డ స్మగ్లర్
- ఢిల్లీ ఎయిర్ పోర్టులో టాంజానియాకు చెందిన వ్యక్తి అరెస్ట్
- డ్రగ్స్ తీసుకెళ్తున్నాడనే అనుమానంతో అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు
- డ్రగ్స్‌తో కూడిన 63 క్యాప్సూల్స్‌ను మింగిన స్మగ్లర్
- రూ.14.97 కోట్లు విలువ చేసే డ్రగ్స్ క్యాపూల్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాంజానియాకు చెందిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీసుకెళ్తున్నాడనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఆ వ్యక్తిని అధికారులు విచారించగా.. కొకైన్ క్యాప్సూల్స్ మింగినట్లు బయటపడింది. దీంతో.. అతనికి వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు. క్యాప్సూల్స్‌లో నింపిన మందు విలువను లెక్కించగా.. కోట్ల రూపాయల్లో ఉంది. దీంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఆగస్టు 1న టాంజానియాకు చెందిన వ్యక్తి దార్ ఎస్ సలామ్ టాంజానియా నుండి అడిస్ అబాబా, దోహా మీదుగా ఢిల్లీకి చేరుకున్నాడు. కాగా.. ఎయిర్ పోర్టులో అనుమానంతో పట్టుకున్నామని అధికారులు తెలిపారు.
Read Also: Garlic: వెల్లుల్లి కూరగాయా..? లేదా మసాలా..? దశాబ్ధాల చర్చకు హైకోర్టు పరిష్కారం..
Also Read
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
విచారణలో భాగంగా.. డ్రగ్స్‌తో కూడిన 63 క్యాప్సూల్స్‌ను మింగినట్లు ఆ వ్యక్తి అధికారుల ముందు అంగీకరించినట్లు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. అతన్ని వైద్య చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతని శరీరం నుండి 63 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. ఈ క్యాప్సూల్స్‌ను శరీరం నుంచి తీసినప్పుడు అందులో 998 గ్రాముల తెల్లటి పౌడర్ కనిపించింది. సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన వ్యక్తులు ఈ పౌడర్ ను మత్తుమందుగా గుర్తించారు. ఈ క్రమంలో.. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. క్యాప్సూల్‌లో తెల్లటి పౌడర్ వెలువడేది కొకైన్ అని విచారణలో తేలింది. 998 గ్రాముల కొకైన్ విలువ రూ.14.97 కోట్లు అని కస్టమ్స్ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం.. ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి మత్తుపదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Gujarat video: రెండు కుక్కలు.. రెండు సింహాల మధ్య ఫైట్.. చివరికి ఏమైందంటే..!
తాజావార్తలు
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
ట్రెండింగ్
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..