కోల్కతా నైట్రైడర్స్ స్టార్ ఆల్రౌండర్, భారత క్రికెటర్ ఇంగ్లండ్‌లో అదరగొట్టాడు. తన బౌలింగ్‌తో జట్టును గెలిపించాడు. వెంకటేష్ అయ్యర్ లన్షైర్ తరపున వన్డే గేమ్ ఆడుతున్నాడు. దాదాపు ఓడిపోయిన మ్యాచ్‌లో అయ్యర్ తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రత్యర్థి జట్టు గెలవాలంటే 8 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉంది. అయితే.. తన జట్టు సభ్యులంతా మ్యాచ్ ఓడిపోయిందని అనుకున్నారు. కానీ వెంకటేష్ అయ్యర్ మ్యాజిక్ చేశాడు. తాను వేసిన 49వ ఓవర్ చివరి రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి వోర్సెస్టర్‌షైర్ జట్టును 3 పరుగుల తేడాతో ఆలౌట్ చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు.
Russia: డ్యాన్సర్‌కు రష్యా కఠిన శిక్ష.. ఉక్రెయిన్‌కు విరాళం ఇచ్చినందుకు 12 ఏళ్లు జైలు
ఇంగ్లండ్ వేదికగా దేశవాళీ వన్డే కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నమెంట్‌లో ఆగస్టు 14న లన్షైర్-వోర్సెస్టర్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వోర్సెస్టర్ చివరి 12 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి వచ్చింది. తొలి 5 ఓవర్లు బౌలింగ్ చేసి 26 పరుగులు మాత్రమే ఇచ్చిన వెంకటేష్ అయ్యర్‌కి 49వ ఓవర్ ఇచ్చారు. ఈ క్రమంలో.. తన అద్భుత బౌలింగ్ తో ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచాడు.
August 15: ఆగస్టు 15 భారత్‌కి మాత్రమే కాదు.. ఈ దేశాలకు కూడా ప్రత్యేకమే..
కాగా.. వెంకటేష్ అయ్యర్ వేసిన చివరి ఓవర్లలో ఏ మాత్రం అంచనాలు లేకుండా ఉండేది. వెంటేశ్ వేసిన ఐదో బంతిని షార్ట్ ఆడిన బ్యాట్స్‌మెన్ బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించాడు.. కాని ఔట్ అయ్యాడు. దీంతో.. జట్టుకు కొంత ఊరట లభించింది. ఆ తర్వాతి బంతికే చివరి వికెట్‌ను ఎల్బీడబ్ల్యూ అయింది. దీంతో.. తన అద్భుత బౌలింగ్ తో జట్టును గెలిపించాడు.
3️⃣ runs required to win.
2️⃣ wickets needed…
Over to you, @venkateshiyer! 😍
🌹 #RedRoseTogether https://t.co/CfuDnk44Oo pic.twitter.com/gNTFO2M6ml
— Lancashire Cricket (@lancscricket) August 14, 2024