సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్ మొదలైంది. కోళ్ల ఫారాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. లక్షల్లో పెట్టుబడిన పౌల్ట్రీల నిర్వాహకులు వాటిని పూడ్చిపెడుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతుచిక్కని వ్యాధితో కోళ్లు చనిపోతున్నాయని పెంపకందారులు చెబుతున్నారు. కేవలం శాంపిల్స్ సేకరించడంతోనే సరిపెడుతూ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుల్కల్, చౌటుకూరు మండలాల్లో కేవలం 3 రోజుల వ్యవధిలో 20వేల కోళ్లు చనిపోయాయి. వరుసగా కోళ్లు మృత్యువాత పడుతుండటంతో జిల్లాలోని కోళ్ల ఫారాలు మూతపడుతున్నాయి.
Read Also: Chelluboyina Venu: ప్రజాజీవనాన్ని మార్చడానికి ప్రయత్నించింది వైసీపీ
తాజాగా.. మెదక్ జిల్లాలో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అంతుచిక్కని వ్యాధితో మొన్నటి వరకు బాయిలర్ కోళ్లు, నేడు వేల సంఖ్యలో నాటు కోళ్లు మృతి చెందాయి. నర్సాపూర్ (మం) లింగాపూర్ గ్రామంలో 6 వేల నాటు కోళ్లను ప్రసాద్ అనే రైతు పెంచుతున్నాడు. ఉదయం నుంచి కోళ్ల ఫారంలో అంతుచిక్కని వ్యాధితో 3500 నాటుకోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇప్పటివరకు 8 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయానని రైతు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పక్కనే బాయిలర్ కోళ్ల ఫామ్ ఉండటంతో వాటికి వచ్చిన రోగమే నాటుకొళ్లకి సోకిందని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటి వరకు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో లక్షల సంఖ్యలో బాయిలర్ కోళ్లు మృత్యువాత పడ్డాయి. కాగా.. చనిపోయిన నాటుకోళ్ల శాంపిల్స్ సేకరించి అధికారులు ల్యాబ్ కి పంపారు.
Read Also: Yash : బాలీవుడ్ ‘రామాయణ్’ షూటింగ్ పై తాజా అప్ డేట్ !