WPL 2025: ఆర్సీబీకి షాక్.. టోర్నమెంట్ నుంచి ఔట్
- డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్
- WPL 2025 టోర్నమెంట్ నుంచి ఔట్
- యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓటమి
- ప్లేఆఫ్స్‌కు చేరుకున్న మూడు జట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి షాక్ తగిలింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025( WPL)లో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. శనివారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో టోర్నీ నుంచి ఔట్ అయింది. కాగా ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న మూడు జట్లను ప్రకటించారు. అయితే, పాయింట్ల పట్టికలో ఏ జట్టు మొదటి స్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ ఆడుతుందో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యుపీ వారియర్స్ జట్టు టోర్నమెంట్ ప్లేఆఫ్స్ రేసు నుండి నిష్క్రమించాయి.
READ ALSO: Prabhas : ‘ది రాజా సాబ్’ రిలీజ్ లేట్‌కి అదే కారణమా..?
Also Read
పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్‌లలో 5 గెలిచి టాప్ ప్లేస్‌లో ఉంది. జట్టు ఖాతాలో 10 పాయింట్లు, +0.396 నికర రన్ రేట్ ఉంది. గుజరాత్ జెయింట్స్ 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచి రెండవ స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో 8 పాయింట్లు.. నికర రన్ రేట్ +0.334 ఉంది. ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచింది. +0.267 నికర రన్ రేట్‌తో మూడవ స్థానంలో ఉంది. కాగా.. నంబర్ వన్ జట్టు నేరుగా ఫైనల్ ఆడుతుంది. రెండు, మూడవ స్థానంలో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడతాయి.
READ ALSO: Virat Kohli: అరుదైన రికార్డుకు దగ్గరలో కోహ్లీ.. మాజీ దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టి..!
పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో యుపీ వారియర్స్ ఉంది. 8 మ్యాచ్‌లు ఆడి 3 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది. ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి.. నికర రన్ రేట్ -0.624 ఉంది. ఈ టోర్నమెంట్‌లో మంచి ఆరంభం చేసిన డిఫెండింగ్ ఛాంపియన్.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో.. టోర్నమెంట్‌లో జట్టు ప్రయాణం ముగిసింది. ఏడు మ్యాచ్‌ల్లో కేవలం 2 మాత్రమే గెలిచింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!