కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. నోవాటెల్ నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బాలినేని బయలుదేరారు. పవన్‌తో భేటీ అనంతరం లాంఛనంగా జనసేన పార్టీలో చేరే విషయాన్ని బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకటించనున్నారు. కాగా.. నిన్న వైసీపీ పార్టీకి బాలినేని శ్రీనివాస్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పంపించారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు.
Read Also: Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం.. బంధుత్వం ఉన్న నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. కొద్ది రోజులుగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు.. ఐదు సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని.. సీనియర్ రాజకీయ నేతగా ఉన్నారు.. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. అయితే, 2019లో మళ్లీ గెలిచి వైసీపీ ప్రభుత్వం తొలి రెండున్నరేళ్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.. ఇక, మంత్రి పదవి నుంచి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు బాలినేని.. మరోవైపు, గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ టికెట్ విషయంలోనూ వైఎస్ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించి వార్తల్లో ఎక్కారు.. ఎన్నికలకు ముందు నుంచే బాలినేని.. అసంతృప్తితో ఉన్నారనే చర్చ సాగినా.. ఇప్పుడు కూడా తన ప్రాధాన్యత దక్కడంలేదంటూ ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు.
Read Also: Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ పొడిగింపు..