ప్రియుడు కోసం ఇద్దరు యువతులు కొట్లాటకు దిగారు. నా వాడంటే నా వాడంటూ జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయ్ అనే బిల్డర్ కోసం కొట్టుకున్నారు ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి.. అనూష అనే ఓ యువతి. అనూష విజయ్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతంలో నాలుగుసార్లు రూ. 15 లక్షలు విలువ చేసే అనూష బంగారాన్ని తాకట్టు పెట్టి విడిపించాడు ప్రియుడు విజయ్.
Read Also: Chennai: చెన్నైలో బీకామ్ విద్యార్థి ఆత్మహత్య.. ఓ మహిళ ఏం చేసిందంటే..!
ఐదవ సారి కూడా ఆమె బంగారాన్ని తాకట్టు పెట్టి రూ. 10 లక్షలు తెచ్చుకున్నాడు. అయితే.. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే నమ్మి బంగారం ఇచ్చానని అనూష చెబుతోంది. ఇంతలో 6 నెలలుగా వీరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెళ్లైనా మరో మహిళతో విజయ్ సంబంధం పెట్టుకున్నాడని.. అందుకే తన ఫోన్ నెంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాడని అనూష తెలిపింది. తనను మోసం చేశాడన్న కోపంతోనే విజయ్ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించానని అనూష అంగీకరించింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకోగా.. బాధితురాలు అనూష ఈరోజు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ప్రియుడు, మహిళ నుంచి తనకు ప్రాణ హాని ఉందని.. తనకు రక్షణ కల్పించాలంటూ బాధితురాలు అనూష చెప్పింది.
Read Also: Stock Market: 5ఏళ్లలో లక్షను..రూ.కోటిగా మార్చిన మద్యం తయారీ కంపెనీ షేర్లు!