Anna Canteens: రెండో విడతలో 75 అన్న క్యాంటీన్ల ప్రారంభం..
- రెండో విడతలో 75 అన్న క్యాంటీన్ల ప్రారంభం
- సెక్రటేరీయేట్ సమీపంలోని అన్న క్యాంటీన్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- అన్న క్యాంటీన్లల్లో టోకెన్లు తీసుకుని పేదలకు ఇచ్చిన సీఎం చంద్రబాబు
- పేదలకు భోజనం వడ్డించిన సీఎం చంద్రబాబు.. మంత్రి నారాయణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండో విడతలో 75 అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. సెక్రటేరీయేట్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. రెండో విడత అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్, గుంటూరు జెడ్పీ ఛైర్ పర్సన్, గుంటూరు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అన్న క్యాంటీన్లల్లో టోకెన్లు తీసుకుని పేదలకు ఇచ్చారు సీఎం చంద్రబాబు. అనంతరం.. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పేదలకు భోజనం వడ్డించారు. తర్వాత.. సీఎం చంద్రబాబు పేదలతో ఇంటరాక్ట్ అయ్యారు. భోజనం ఎలా ఉందంటూ అడిగారు.
పేదలకు ప్రభుత్వం చక్కటి భోజనం పెడుతోందని మహిళలు తెలిపారు.
Read Also: Rahul Gandhi: రాహుల్‌గాంధీని టెర్రరిస్టు అన్న కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 175 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం.. ఇదో పవిత్ర కార్యక్రమం అని అన్నారు. పేదలకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టేలా ఈ పథకాన్ని ప్రారంభించాం.. పరిశుభ్రమైన, పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశ్యంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించామని ముఖ్యమంత్రి తెలిపారు. రూ.15తో మూడు పూటల అన్నం పెట్టే ఉద్దేశ్యంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. ప్రతి అన్న క్యాంటీన్లల్లో భోజనం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. మరోవైపు.. వరద సాయం కోసం చిన్నారులు మొదలుకుని చాలా మంది విరాళాలు ఇచ్చారని అన్నారు. మంచికి స్థానం ఉందని దాతలు నిరూపించారని చంద్రబాబు పేర్కొన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి.. అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలి.. అన్న క్యాంటీన్ల కోసం సుమారు రూ. 150 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం చెప్పారు.
Read Also: Thota Trimurthulu: జనసేనలోకి ఎమ్మెల్సీ తోట జంప్..!?
ఈ ఖర్చును ప్రభుత్వం భరించగలదు.. కానీ ప్రజల్లో సేవా స్ఫూర్తిని పెంచేలా చేయడం కోసం విరాళాలు అడుగుతున్నామని చంద్రబాబు అన్నారు. అన్న క్యాంటీన్ల మీద కూడా కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి.. సేవా కార్యక్రమాల పైనా ఈ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. సేవా భావంతో పని చేసే కార్యక్రమాలను విమర్శలు చేయడం దివాలాకోరుతనమే అని తెలిపారు. ఏపీ చేపట్టిన వరద సహయక చర్యలను దేశం మొత్తం గుర్తించిందని సీఎం పేర్కొన్నారు. మరోవైపు.. జల్ జీవన్ మిషన్ స్కీంను అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకున్నాయని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఏపీ మాత్రం జల్ జీవన్ మిషన్ వినియోగించుకోలేకపోయింది.. జల్ జీవన్ మిషన్ స్కీంను వినియోగించుకోకుండా రాష్ట్రానికి ద్రోహం చేశారని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..