ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. వంద రోజుల చంద్రబాబు పాలనలో ఆరుసార్లు క్యాబినెట్ సమావేశమైనా.. ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని విమర్శించారు. పన్నులు వేయటం, జనాన్ని పీక్కుతినటం తప్ప మరేమీ లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు వచ్చారు, పన్నులు పెంచారు.. చంద్రబాబు వచ్చారు, జనాన్ని వరదల్లో ముంచారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు ఇలా ఉంటే మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. అమ్మకు వందనం పేరుతో మహిళలను మోసం చేసినందుకా మీది మంచి ప్రభుత్వమా..? వాలంటీర్లను నిలువునా మోసం చేసిన మీది మంచి ప్రభుత్వామా?.. వరదల్లో జనాన్ని ముంచినందుకు మంచి ప్రభుత్వమా?.. లిక్కర్ తో జనాన్ని తాగించబోతున్నందుకు మంచి ప్రభుత్వమా?.. ఇసుక దోపిడీ చేస్తున్నందుకు మీది మంచి ప్రభుత్వమా?.. అని ప్రశ్నించారు. జనమంతా మీది ముంచే ప్రభుత్వం అంటుంటే చంద్రబాబు మాత్రం డబ్బాలు కొట్టుకుంటున్నారని అంబటి రాంబాబు తెలిపారు.
Devara: మెంటలెక్కిస్తున్న ‘దేవర’.. ఒక్కోటి ఒక్కో డైమాండ్ మావా!
నాణ్యమైన మంచి మద్యం అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు.. మద్యం తాగటం ప్రమాదకరం అనే మాట ఇక తీసెయ్యండి.. నాణ్యమైన మద్యం తాగటం మంచిది అని పెట్టండని అంబటి రాంబాబు విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనంతా మద్యం మీద ఆదాయం పొందాలనే.. ఈ మద్యం పాలసీ వెనుక పెద్దస్కాం ఉందని అన్నారు. తమ హయాంలో మద్యం తాగటం వలన జనం చచ్చిపోతున్నారని ప్రచారం చేశారు.. మరి ఈ వంద రోజులుగా తమ హయాంలోని బ్రాండ్లే ఉన్నాయి కదా..? అని ప్రశ్నించారు. మరి ఇప్పుడు జనం చనిపోలేదేం..?. విష ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందటానికి చంద్రబాబు ప్రయత్నం చేశారు.. ప్రయివేటు మద్యం దుకాణాల వలన పెద్ద ఎత్తున సిండికేట్ అవుతారు.. వైసీపీ హయాంలో ఉన్న బార్ల యజమానులను బయటకు నెట్టి, టీడీపీ నేతలు ఆక్రమించారని అంబటి పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో తెచ్చిన మద్యం బ్రాండ్లే ఆ హయాంలోనూ కొనసాగాయి.. స్కాంల కోసమే మద్యం పాలసీని తెచ్చారని ఆరోపించారు.
Balineni Meet Pawan Kalyan: కూటమి నేతలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా..- బాలినేని
చంద్రబాబు ఈ మధ్య బాగా ప్రెస్టేషన్‌కి గురవుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. కృష్ణా వరదల వలన చంద్రబాబు ఇల్లు మునుగుతున్నా ఎందుకు కూల్చి పక్కకి రాలేదని ప్రశ్నించారు. మీ ఇల్లు కూల్చకుండా బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామంటే జనం ఊరుకోరని తెలిపారు. మరోవైపు.. అధికారం లేనప్పుడు కొంతమంది నేతలు పార్టీ వీడి వెళ్తుంటారు.. వారి నైతికతే పోతుందే తప్ప పార్టీకి నష్టం లేదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ పద్దతి నచ్చుతుందంట, అధికారం లేనప్పుడు జగన్ పద్దతి నచ్చదంట అని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రజలే నిర్ణయిస్తారు.. పార్టీ మారిన వాళ్లలో 99 % మంది పరిస్థితి ఎలా వుందో చూసుకోవాలని అంబటి రాంబాబు సూచించారు.